Telangana: డ్రగ్స్‌పై పోలీసుల సినిమా తరహా జాయింట్ ఆపరేషన్.. పెద్ద తిమింగలాలే చిక్కాయి

డ్రగ్స్‌ మహమ్మారిని అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నా.. పోలీసుల ఎత్తులను చిత్తు చేస్తున్నారు పెడ్లర్లు. పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా.. సినిమాటిక్‌ రేంజ్‌లో డ్రగ్స్‌ దందా నడుపుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ డ్రగ్ పెడ్లర్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Telangana: డ్రగ్స్‌పై పోలీసుల సినిమా తరహా జాయింట్ ఆపరేషన్.. పెద్ద తిమింగలాలే చిక్కాయి
Police Arrested Drug Peddlers
Follow us
Peddaprolu Jyothi

| Edited By: Velpula Bharath Rao

Updated on: Oct 26, 2024 | 10:12 AM

సిటీలో మరోసారి పెద్ద ఎత్తున్న డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. ఇతర దేశాలు, పక్క రాష్ట్రాల నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఓ అంతర్జాతీయ డ్రగ్‌ పెడ్లర్‌తోపాటు అంతర్రాష్ట్ర డ్రగ్‌ పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ పోలీసులు, హెచ్‌న్యూ టీమ్‌ కలిసి చేసిన జాయింట్‌ ఆపరేషన్‌లో సూడాన్‌కి చెందిన ఇంటర్నేషనల్‌ డ్రగ్‌ పెడ్లర్‌ మహమ్మద్‌ అబ్దుల్‌ రెహమాన్‌ అలియాస్‌ హానిన్‌ పట్టుబడ్డాడు. సౌడాన్‌‌లోని సౌత్‌ డార్ఫర్‌‌కి చెందిన హానిన్‌.. 2016లో స్టూడెంట్‌ వీసాపై హైదరాబాద్‌ వచ్చాడు. టోలిచౌకిలో ఉంటూ.. మెహిదీపట్నంలోని ఓ ప్రైవేట్‌ స్పోకెన్‌ ఇంగ్లీష్‌ కోర్సులో చేరాడు. 2017లో తిరిగి సూడాన్‌ వెళ్లిపోయిన హానిన్‌.. మళ్లీ 4 ఏళ్ల స్టూడెంట్‌ వీసాపై భారత్‌ వచ్చాడు. 2018లో ఉత్తరప్రదేశ్‌లోని ఓ యూనివర్సిటీలో బీసీఏ కోర్సులో చేరిన హానిన్‌.. ఫస్ట్‌ ఇయర్‌ పూర్తిచేశాడు. కరోనా కారణంగా.. తిరిగి సూడాన్‌ వెళ్లిపోయాడు. 2022లో తిరిగి ఉత్తరప్రదేశ్‌ వచ్చి.. బీసీఏ కోర్సు పూర్తి చేశాడు. 2024లో హైదరాబాద్‌ చేరుకుని టోలిచౌకిలో అద్దెకు దిగాడు.

చదువు పూర్తయింది.. వీసా గడువు ముగిసింది. అయినా అక్రమంగా హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి అడ్డదారులు తొక్కాడు. డ్రగ్స్‌ దందాకు తెరలేపాడు. నైజీరియా, టాంజానియా, సూడాన్‌, పాలస్తీనా దేశాల నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నాడు హానిన్‌. ఇటీవల హైదరాబాద్‌లో సింథటిక్‌ డ్రగ్స్‌ ఎక్కువగా పట్టుబడుతుండటం… అది కూడా గోవా, బెంగుళూరు నుంచి ఈ డ్రగ్స్‌ వస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఈ రూట్‌లలో నిఘా పెంచారు. ఈ క్రమంలో పోలీసులకు హానిన్‌ లింక్‌ దొరికింది. అంతర్రాష్ట్ర డ్రగ్‌ పెడ్లర్‌ నందకుమార్‌ అలియాస్‌ లాలుతోపాటు.. లోకల్ పెడ్లర్లు మహ్మద్‌ ఇమ్రాన్‌, కొడిదల నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 80 గ్రాముల ఎండీఎంఏ, 10 ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి