ఆకాశాన్ని అంటిన ఉల్లి ధరలు.. క్వింటా రూ.7వేలు
ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటాయి. హోల్‌సేల్‌గానూ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్‌లోని మలక్‌పేట మార్కెట్‌లో మొదటి రకం

Onion Price Hyderabad: ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటాయి. హోల్‌సేల్‌గానూ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్‌లోని మలక్‌పేట మార్కెట్‌లో మొదటి రకం ఉల్లి ధర క్వింటా 7వేలుగా పలుకుతోంది. వర్షానికి తడిచిన చిన్న ఉల్లి ధర కూడా క్వింటా 5వేల పైనే నడుస్తోంది. గతంలో వందల్లో ఉల్లి లోడ్ వస్తుండగా.. భారీ వర్షాలతో పూర్తిగా తగ్గిపోయింది. ఈ రోజు మార్కెట్‌కి 25 లారీల లోడ్ మాత్రమే వచ్చింది. మహారాష్ట్ర నుంచి తప్ప వేరే ప్రాంతాల నుంచి మార్కెట్‌కి ఉల్లి లోడ్ రావడం లేదు. ఇక ధరలతో కోయకుండానే వినియోగదారుల కంట కన్నీరు వస్తోంది.
Read More:
Follow Us