AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మృగశిర కార్తె సందర్భంగా చెరువు లూటీ.. ఖాకీల వేటు..

మృగశిర కార్తె సందర్భంగా చెరువులో చేపల లూటీకి పాల్పడుతున్న గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చేపల కోసం వెళ్లి కటకటాల పాలయ్యారు. 60 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. మహబూబాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా.. ..

Telangana: మృగశిర కార్తె సందర్భంగా చెరువు లూటీ.. ఖాకీల వేటు..
Fish
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Jun 08, 2026 | 6:26 PM

Share

మృగశిర కార్తె సందర్భంగా చేపల కోసం పరుగులు పెడుతున్న జనం మహబూబాబాద్ జిల్లాలో ఊహించని చిక్కుల్లో చిక్కుకున్నారు. చెరువులో చేపల లూటికి పాల్పడి కేసుల పాలయ్యారు. చెరువులో చేపలు పెంచుతున్న మత్స్యకారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. చేపల లూటికి పాల్పడిన వారిలో 60 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. కురవి మండల శివారు పెద్దచెరువులో చేపలన్నీ లూటి అయ్యాయి. పరిసర గ్రామాల ప్రజలు తండావాసులు ఒక్కసారిగా చెరువుపై పడ్డారు. వలలు, చీరలు, లుంగీలతో చేపలు దొరికిన కాడికి దొరికినని దోచుకుపోయారు.

మృగశిర కార్తె ఎఫెక్ట్

మృగశిర కార్తె ఎఫెక్ట్ తో చిన్నా పెద్ద, ఆడామగా తేడా లేకుండా సుమారు వెయ్యి మందికి పైగా చెరువులోకి దిగి చేపలు లూటీ చేశారు.. చెరువు అంతా జనంతో జాతర వాతావరణాన్ని తలపించింది.. చేతికి దొరికిన చేపలను అప్పటికే చాలామంది ఇంటికి తీసుకెళ్లి పండగ చేసుకున్నారు. మత్స్యకారులు వచ్చి ప్రాధేయ పడినా వినకుండా చెరువుని లూటీ చేశారు. ఈ క్రమంలో బాధితుడు పోలీసులకు పిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. చెరువు వద్ద ఉన్న సుమారు 60 ద్విచక్ర వాహనాలను ట్రాక్టర్ల ద్వారా పోలీస్ స్టేషన్ కు తరలించారు. చేపల కోసం కక్కుర్తి పడ్డ 14 మందిని అరెస్ట్ చేశారు. భారీ ఎత్తున నష్టం జరిగిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా దౌర్జన్యంగా చర్యలు నూటికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.  ఈమధ్య వరుసగా జరుగుతున్న చెరువులోకి ఘటనలో మత్స్యకారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Follow Us
గ్యాస్, ఎసిడిటీ పోవాలంటే.. అర స్పూన్ తీసుకుంటే మళ్ళీ ఇక రాదు
గ్యాస్, ఎసిడిటీ పోవాలంటే.. అర స్పూన్ తీసుకుంటే మళ్ళీ ఇక రాదు
రైతులకు అలర్ట్‌.. పీఎం కిసాన్‌ 24వ విడత ఎప్పుడు వస్తుందో తెలుసా?
రైతులకు అలర్ట్‌.. పీఎం కిసాన్‌ 24వ విడత ఎప్పుడు వస్తుందో తెలుసా?
ఓటీటీని శాసిస్తున్న సినిమా..
ఓటీటీని శాసిస్తున్న సినిమా..
ఎన్నాళ్లు ఇలా అపోహల్లో ఉంటారు.. వానాకాలంలో పెరుగు తింటే జరిగేదిదే
ఎన్నాళ్లు ఇలా అపోహల్లో ఉంటారు.. వానాకాలంలో పెరుగు తింటే జరిగేదిదే
ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారా..? కేంద్రం నుంచి శుభవార్త
ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారా..? కేంద్రం నుంచి శుభవార్త
సచిన్ రికార్డు తుడిచేసిన వైభవ్.. ఆ విషయంలో బుడ్డోడి క్రేజ్ చూస్తే
సచిన్ రికార్డు తుడిచేసిన వైభవ్.. ఆ విషయంలో బుడ్డోడి క్రేజ్ చూస్తే
పూరి కూతురిలో అద్భుతమైన టాలెంట్.. ఫోటోస్ చూస్తే..
పూరి కూతురిలో అద్భుతమైన టాలెంట్.. ఫోటోస్ చూస్తే..
త్రివర్ణ జెండా ఎగురవేస్తున్నారా..? ఈ తప్పులు చేస్తే జైలుకే!
త్రివర్ణ జెండా ఎగురవేస్తున్నారా..? ఈ తప్పులు చేస్తే జైలుకే!
కొరడా చేతపట్టి వీధుల్లోకి ప్రభుత్వ బడి టీచర్‌.. అసలు సంగతి ఏమంటే?
కొరడా చేతపట్టి వీధుల్లోకి ప్రభుత్వ బడి టీచర్‌.. అసలు సంగతి ఏమంటే?
ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా..
ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా..