Hyderabad: హైదరాబాదీలకు అలర్ట్‌.. మధ్యాహ్నం 3 తర్వాత ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు..

సద్దుల బతుకమ్మ పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఈరోజు (సోమవారం) ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తన వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులకు ట్రాఫిక్‌ అధికారులు పలు కీలక సూచనలు చేశారు...

Hyderabad: హైదరాబాదీలకు అలర్ట్‌.. మధ్యాహ్నం 3 తర్వాత ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు..
Traffic Restrictions Hydera
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 03, 2022 | 9:16 AM

సద్దుల బతుకమ్మ పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఈరోజు (సోమవారం) ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తన వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులకు ట్రాఫిక్‌ అధికారులు పలు కీలక సూచనలు చేశారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎల్టీ స్టేడియం చుట్టూ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండనున్నట్లు ప్రకటించారు. వీటి ఆధారంగా వాహనదారులు తమ ప్లాన్‌ను మార్చుకోవాలని అధికారులు సూచించారు.

నగరంలోని బషీర్‌బాగ్‌, పీసీఆర్‌ జంక్షన్‌, రవీంద్రభారతి, లిబర్టీ, ట్యాంక్‌బండ్‌, ఖైరతాబాద్‌, తెలుగుతల్లి, మోజంజాహి మార్కెట్‌, నాంపల్లి, అబిడ్స్‌, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండనున్నట్లు తెలిపారు. అలాగే ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాల్లో అంబేద్కర్‌ విగ్రహం, కవాడిగూడ, కట్టమైసమ్మ ఆలయం, కర్బాలమైదాన్‌, బైబిల్‌ హౌస్‌, రాణిగంజ్‌, నల్లగుట్ట జంక్షన్లలో ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.

మరీ ముఖ్యంగా ఎల్బీ స్టేడియం, లిబర్టీ జంక్షన్‌తో పాటు అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలని సూచించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే నగరం నుంచి పెద్ద జనాలు పెద్ద ఎత్తున పల్లె బాట పట్టిన విషయం తెలిసిందే. దసరా సెలవుల నేపథ్యంలో ఆర్టీసీ, రైల్వే అధికారులు ప్రత్యేక సర్వీసులను నడిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..