Hyderabad: హైదరాబాద్‌లో ఉగ్ర కుట్ర భగ్నం.. దసరా పండుగే వారి టార్గెట్.. వెలుగులోకి సంచలన విషయాలు

భాగ్యనగరానికి పెను ముప్పు తప్పింది. దసర పండుగ వేళ కల్లోలం సృష్టించాలన్న టెర్రరిస్టులు ప్లాన్‌ను భగ్నం చేశారు పోలీసులు. ఉగ్రకుట్ర గురించి తెలిసి హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Hyderabad: హైదరాబాద్‌లో ఉగ్ర కుట్ర భగ్నం.. దసరా పండుగే వారి టార్గెట్.. వెలుగులోకి సంచలన విషయాలు
Suspected Terrorists
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 03, 2022 | 9:55 AM

హైదరాబాద్‌లో ఉగ్ర కుట్ర బయటపడింది. వరుస పేలుళ్లతో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్లాన్‌ వేశారు. ఈ ఉగ్ర కుట్ర కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రధాన నిందితుడు అబ్దుల్‌ జామెద్‌కు ఐఎస్‌ఐ, లష్కరే తోయిబాలతో లింక్‌లు ఉన్నాయి. హైదరాబాద్‌లో పేలుళ్లతో అలజడి సృష్టించాలనేది వీరి ముగ్గురి ప్లాన్‌. ఆ ఏర్పాట్లలో ఉండగానే పోలీసులు ఈ ముగ్గురిని అరెస్టు చేశారు. దసరా వేడుకల్లో విధ్వంసానికి జాహెద్‌ గ్యాంగ్‌ స్కెచ్‌ వేశారు. సైదాబాద్‌లో జాహెద్‌ గ్యాంగ్‌ రెక్కీ నిర్వహించారు. హ్యాండ్‌ గ్రనేడ్‌ ద్వారా విధ్వంసానికి ప్లాన్‌ చేశారు. దసరా రోజు పేలుళ్ల కోసం భారీగా పేలుడు సామగ్రి సేకరించారు. ఐదు రోజుల కిందట తొమ్మిది మందితో సమావేశమై పేలుళ్ల కోసం వ్యూహరచన చేశారు. ఈ పేలుళ్ల కోసం పాకిస్తాన్‌ నుంచి నిధులు అందినట్లు పక్కా సమాచారాన్ని పోలీసులు సేకరించారు.

ఈ ఉగ్రకుట్రలో జాహెద్‌దీ మెయిన్‌ రోల్‌. పేలుళ్ల కోసం నిధులు పాకిస్తాన్‌ నుంచి జాహెద్‌కు అందినట్లు తెలుస్తోంది. ఈ డబ్బుతోనే పేలుళ్ల కోసం సామగ్రిని సేకరించినట్లు సమాచారం. జాహెద్‌ గ్యాంగ్‌ నుంచి నాలుగు గ్రనేడుల్ఉ, దాదాపు ఐదున్నర లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్రనేడ్‌లు పాకిస్తాన్‌ నుంచి సరఫరా అయినట్లు గుర్తించారు. పోలీసుల అలర్ట్‌తో మహానగరానికి పెనుముప్పు తప్పింది. అయితే ISIతో డైరెక్టుగా టెర్రర్‌ లింక్‌ వెలుగులోకి రావడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. జాహెద్‌ టెర్రర్‌ హిస్టరీ చూస్తే… హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా ఉగ్రదాడుల్లో నిందితుడు. 2005లో బేగంపేటలో టాస్క్‌ఫోర్స్‌ ఆఫీసుపై జరిగిన ఆత్మాహుతి దాడిలో ప్రమేయం ఉందని పోలీసులు అరెస్టు చేశారు. అండర్‌ ట్రయల్ ఖైదీగా 12 ఏళ్లు జైలులో ఉన్నాడు. ఆ తర్వాత 2017 కోర్టు కేసు కొట్టి వేసింది.

2002లో దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయం దగ్గర దాడుల్లో జాహెద్‌ గ్యాంగ్‌ పాత్ర ఉంది. 2004లో సికింద్రాబాద్‌ గణేష్‌ దేవాలయంలో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు గుర్తించారు. యువతను ఉగ్రవాదులుగా మార్చేందుకు జాహెద్‌కు పాకిస్తాన్‌ నుంచి నిధులు అందుతున్న పోలీసుల విచారణలో తేలింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..