AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఇకపై లైట్ తీసుకోడాలు ఉండవ్.. లైన్ క్రాస్ చేస్తే ఫైన్ పడుద్ది.. ఇవిగో డీటేల్స్..

సిటీలో నేటి నుంచి ఆపరేషన్ రోప్ ప్రారంభించారు పోలీసులు. ట్రాఫిక్ నిబంధనలను కఠినతరంగా అమలు చేయనున్నారు. లైన్ క్రాస్ చేస్తే భారీ ఫైన్లు వడ్డించనున్నారు.

Hyderabad: ఇకపై లైట్ తీసుకోడాలు ఉండవ్.. లైన్ క్రాస్ చేస్తే ఫైన్ పడుద్ది.. ఇవిగో డీటేల్స్..
Hyderabad Traffic Police
Ram Naramaneni
|

Updated on: Oct 03, 2022 | 11:49 AM

Share

హైదరాబాద్‌లో ఇకపై రోడ్డు నియమాలు ఉల్లంఘిస్తే భారీగా ఫైన్ పడుద్ది. ట్రాఫిక్‌ పోలీసుల ఆపరేషన్‌ ‘రోప్‌’ (‘రోడ్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పార్కింగ్‌ అండ్‌ ఎంక్రోచ్‌మెంట్‌’) చేపట్టారు. ఇక నుంచి గీత దాటితే బాదుడే బాదుడు. కూడళ్ల వద్ద రెడ్‌లైట్‌ పడినప్పుడు పాదచారులు అటూ, ఇటూ రోడ్డు దాటుతున్న సమయంలో వైట్‌ స్టాప్‌ లైన్‌ దాటితే చలాన్‌ పడుద్ది. స్టాప్‌ లైన్‌ దాటి ముందుకు వస్తే 200 రూపాయల జరిమానా విధిస్తారు. గతంలో ఈ ఫైన్ రూ.100 మాత్రమే ఉండేది.  ఫ్రీలెప్ట్‌ను బ్లాక్‌ చేస్తే వెయ్యి రూపాయలు భారీ జరిమానా విధించబోతున్నారు. పాదచారులకు అటంకం కలిగేలా పార్కింగ్‌ చేస్తే 600 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఇక దుకాణదారులు ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే భారీ పైన్స్ వేయడంతో పాటు కేసులు కూడా పెట్టనున్నారు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ ప్రీ ప్లో కోసం ఆపరేషన్‌ రోప్‌ నిర్వహిస్తున్నారు. సోమవారం నుంచి మొదలైన ఈ ఆపరేషన్‌ కొనసాగుతుందని అధికారులు చెప్పారు. ‘ఆపరేషన్​ రోప్​’ను  సీపీ సీవీ ఆనంద్ స్వయంగా పరిశీలిస్తున్నారు.

నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వాహనదారులను పోలీసులు కోరారు. నగరంలో ట్రాఫిక్‌ సమస్యకు చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయమన్నారు. ఏడాది వ్యవధిలో ట్రాఫిక్‌ సమస్యను అధిగమించాలనే టార్గెట్‌తో ప్రణాళికలు రూపొందించినట్లు సీపీ చెప్పారు. ఈ ఆపరేషన్‌ను సీరియస్‌గా తీసుకుంది పోలీస్ డిపార్ట్‌మెంట్. ప్రతి వారం ఫస్ట్ రోజు జాయింట్‌ సీపీ నుంచి హోంగార్డు వరకు రోడ్లపై ఉండి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఫ్రీ లెఫ్ట్‌ సరిగ్గా కనిపించేలా, యూ టర్న్‌ల వద్ద సేఫ్‌ టర్నింగ్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఇక సోషల్ మీడియాలో కూడా ట్రాఫిక్ నిబంధనల గురించి విసృతంగా అవగాహన కల్పించనున్నారు. అందుకోసం ప్రత్యేకంగా లఘు చిత్రాలు రూపొందించనున్నారు. ట్రాఫిక్‌కు అడ్డంకిగా ఉన్న వెహికల్స్‌ను త్వరితగతిన క్లియర్ చేసేందుకు టోయింగ్‌ వాహనాలను డబుల్ చేశారు. ఇక ప్రజంట్ ఉన్న ట్రాఫిక్‌ సిబ్బందికి అదనంగా 40 మంది ఎస్‌ఐలు, 100 మంది హోంగార్డులను కేటాయించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.