Hyderabad: ప్రయాణికులకు హైదరాబాద్‌ మెట్రో షాక్‌.. ఇకపై ఆ సేవలు ఉచితం కాదు.

ప్రయాణికులకు హైదరాబాద్‌ మెట్రో షాకింగ్ న్యూస్‌ చెప్పింది. మొన్నటి మొన్న స్మార్ట్‌కార్డులు, క్యూఆర్‌కోడ్‌లపై ఉన్న 10 శాతం రాయితీపై కోత పెట్టిన విషయం తెలిసిందే. రద్దీ లేని వేళలకు మాత్రమే ఈ రాయితీని పరిమితం చేశారు. అంతేకాకుండా సెలవు రోజుల్లో అందుబాటులో ఉన్న రూ. 59 అన్‌లిమిటెడ్ ట్రావల్‌ టికెట్‌ను..

Hyderabad: ప్రయాణికులకు హైదరాబాద్‌ మెట్రో షాక్‌.. ఇకపై ఆ సేవలు ఉచితం కాదు.
Hyderabad Metro
Follow us

|

Updated on: Jun 02, 2023 | 8:21 PM

ప్రయాణికులకు హైదరాబాద్‌ మెట్రో షాకింగ్ న్యూస్‌ చెప్పింది. మొన్నటి మొన్న స్మార్ట్‌కార్డులు, క్యూఆర్‌కోడ్‌లపై ఉన్న 10 శాతం రాయితీపై కోత పెట్టిన విషయం తెలిసిందే. రద్దీ లేని వేళలకు మాత్రమే ఈ రాయితీని పరిమితం చేశారు. అంతేకాకుండా సెలవు రోజుల్లో అందుబాటులో ఉన్న రూ. 59 అన్‌లిమిటెడ్ ట్రావల్‌ టికెట్‌ను సైతం రూ. 100 పెంచేశారు. ప్రయాణికులకు ఇలా వరుస షాక్‌లు ఇస్తున్న మెట్రో తాజాగా మరో బ్యాడ్‌ న్యూస్‌ చెప్పింది.

ఇకపై హైదారాబాద్‌ మెట్రోలో పబ్లిక్‌ టాయిలెట్లను ఉపయోగించుకోవాలంటే డబ్బులు చెల్లించాల్సిందే. యూజర్‌ చార్జీల పేరుతో డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించారు. జూన్‌ 2వ తేదీ (నేటి) నుంచే ఇది అమల్లోకి రానున్నట్లు తెలిపారు. ఇకపై ప్రయాణికులు మెట్రో స్టేషన్స్‌లో టాయిలెట్‌కు రూ. 5, యూరినల్‌కు రూ. 2 చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్‌ వ్యాప్తంగా దాదాపు అన్ని మెట్రో స్టేషన్స్‌లో టాయిలెట్స్‌ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.

ఇప్పటి వరకు వీటిని ఉపయోగించుకోవడానికి ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ తాజాగా ఆదాయ మార్గాలను పెంచుకునే లక్ష్యంతో మెట్రో చార్జీలు వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రయాణికులపై ఈ చార్జీలు భారంగా మారనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..