Hyderabad: బాలింత.. బిడ్డ పుట్టి కొన్ని రోజులే.. శృంగారం కోసం వేధించిన భర్త.. పాపం చివరకు

తరుణ్‌ మనిషి అన్న సంగతి మరిచిపోయాడు. మృగంలా మారాడు. భార్య అని కూడా చూడకుండా..పిడికిలి బిగించి ముఖంమీద చాలాసార్లు కొట్టాడు. అయినా ఆవేశం చల్లారలేదు. అక్కడి నుంచీ పోలేదు..ముఖంపై కొట్టి బలవంతంగా శృంగారంలో పాల్గొన్నాడు.

Hyderabad: బాలింత.. బిడ్డ పుట్టి కొన్ని రోజులే.. శృంగారం కోసం వేధించిన భర్త.. పాపం చివరకు
New Mother Killed
Follow us

|

Updated on: Jun 02, 2023 | 8:16 PM

ప్రేమంటే ఇదేనా..పెళ్లంటే అంతేనా..కాపురం కామెడీనా..శృంగారం ఉన్మాదమా.. 36 రోజుల పసిగుడ్డు పరిస్థితి ఏంటి..ఆ పిల్ల భవిష్యత్‌ ఏంటి..ఇంటిని నరకం చేయడమే ప్రేమా..భార్యను కసితీరా కొట్టి చంపడమే భర్త పనా..? ఝాన్సీ వయసు 19 ఏళ్లు.. తరుణ్‌కు 21 ఏళ్లు.. మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. సైదాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఖాజాబాగ్‌లో ఉంటారు. మూడేళ్లు ముచ్చటగా ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరు విడిచి ఉండలేని స్థితికి వచ్చారు. నువ్వులేక నేను లేనేలేనని మాటిచ్చుకున్నారు. మనసులు కలిశాయని..ఇక మనువాడాల్సిందేనని కమిటయ్యారు. పెళ్లికి ఫిక్సయ్యారు. రెండేళ్ల కిందట ఝాన్సీ మెడలో తరుణ్‌ మూడు ముళ్లు వేశాడు. ఆటో నడిపే తరుణ్‌కు ఝాన్సీ అంటే చాలా ఇష్టమట. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాడట. ఇద్దరూ ఇష్టపడే చేసుకున్నారు. చూడ ముచ్చని జంటలా ఉన్న ఆ ఇద్దరికీ పండంటి బిడ్డ కలిగింది. ఆ చిన్నారి వయసు 36 రోజులు..

ఝాన్సీ నిండు బాలింత..బిడ్డ పుట్టాక..ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఆరోగ్యం కూడా అంతగా సహకరించడం లేదు. ఏదో పడుతూ లేస్తూ..ఇంటి పని..వంటపని..బిడ్డపని చూసుకుంటోంది. ఇదంతా తరుణ్‌కూ తెలుసు.. అయినా అతడిలో ఉన్మాది బయటకొచ్చాడు. ఎవరైనా సరే ప్రసవించాక కొంతకాలం శృంగారానికి దూరంగా ఉంటారు. ఝాన్సీ కూడా పచ్చి బాలింత. ఆమె కూడా భర్త పిలిచినా ఇప్పుడొద్దని చెబుతూనే ఉంది..తరుణ్‌ మాత్రం ఒక్కోసారి మరీ సైకోలా బిహేవ్‌ చేస్తున్నా..అతడికి సర్ది చెబుతూ ఉండేది.. అయినా తరుణ్‌ ఆగలేకపోయేవాడు. తనకు కావాల్సిందేనని పట్టుబట్టేవాడు. ఝాన్సీ ఆరోగ్యం బాగోలేదని మొత్తుకున్నా అర్థం చేసుకునేవాడు కాదు.. రోజూ ఇలాగే గడిచేది..గత నెల 20 వ తేదీన మాత్రం తరుణ్‌ ఉన్మాదిలా మారాడు..ఏయ్‌ ఝాన్సీ..రావే అని పిలిచాడు. ఇవాళ ఇవ్వకపోతే చంపేస్తా నిన్ను అని గట్టిగా అరిచాడు. ఝాన్సీ మాత్రం..బిడ్డ పుట్టి 36 రోజులే అయ్యింది. ఇంకా వళ్లంతా పచ్చిపుండులా ఉంది. పైగా నాకు ఆరోగ్యం కూడా అంత బాగోలేదు..కొన్ని రోజులు వద్దని చెప్పింది. ఈ మాటలు తరుణ్‌ చెవికి ఎక్కలేదు..అతడి నోట ఒకటే మాట. ఇవాళ కావాల్సిందేనని..ఝాన్సీ రానని..ఇలా ఇద్దరి మధ్య కొద్దిసేపు గొడవ జరిగింది

తరుణ్‌ మనిషి అన్న సంగతి మరిచిపోయాడు. మృగంలా మారాడు. భార్య అని కూడా చూడకుండా..పిడికిలి బిగించి ముఖంమీద చాలాసార్లు కొట్టాడు. అయినా ఆవేశం చల్లారలేదు. అక్కడి నుంచీ పోలేదు..ముఖంపై కొట్టి బలవంతంగా శృంగారంలో పాల్గొన్నాడు. ఆపై రెండు చేతులతో గొంతు పిసికి చంపేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి తేరుకున్నాడు. ఒక పక్క పాప ఏడుస్తోంది.మరోవైపు విగతజీవిగా పడి ఉన్న ఝాన్సీ.. అర్ధరాత్రి భార్యను తీసుకుని ఆస్పత్రికెళ్లాడు..మొదట అనారోగ్యం కారణంగా చనిపోయిందని నమ్మ బలికాడు. పోస్టుమార్టంలో తరుణ్‌ తతంగమంతా తెలిసింది. పోలీసుల ముందు నిజం ఒప్పుకున్నాడు. ఇప్పుడు రిమాండ్‌లో ఉన్నాడు. క్షణికావేశంతో భార్యను చంపకున్నాడు. 36 రోజుల పసికందును ఒంటరిని చేశాడు. తల్లిలేని పిల్లను చేశాడు. శృంగారానికి సహకరించలేదని..ప్రేమించి పెళ్లి చేసుకున్న పెళ్లాన్ని దారుణంగా చంపాడు. చివరకు మిగిలిందేంటో అతడికే తెలియాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..