Hyderabad: డ్రగ్స్, దోపిడీలు, దొంగతనాలు.. వెలుగులోకి వస్తున్న కరణ్ సింగ్ అరాచకాలు.. అమ్మాయిలను..
నార్సింగ్ దారిడోపిడీ కేసులో ప్రధాన నిందితుడు కరణ్‌సింగ్.. పట్టుబడిన విషయం తెలిసిందే. అతన్ని లోతుగా విచారిస్తే దిమ్మదిరిగే విషయాలు బయటకొస్తున్నాయి.
నార్సింగ్ దారిడోపిడీ కేసులో ప్రధాన నిందితుడు కరణ్‌సింగ్.. పట్టుబడిన విషయం తెలిసిందే. అతన్ని లోతుగా విచారిస్తే దిమ్మదిరిగే విషయాలు బయటకొస్తున్నాయి. కరణ్‌సింగ్ నేరచరిత్రను తవ్వితీస్తే అతని ఆగడాలు వెలుగులోకి వస్తున్నాయి. కరణ్‌సింగ్ వైట్నర్ వంటి మత్తుపదార్థాలు తీసుకోవడం, అమ్మాయిలను వేధించడం, దాడిచేసి డబ్బులు, నగలు దోచుకోవడం కరణ్‌సింగ్ ప్రవృత్తి. మైనర్ స్టేజ్ నుంచే కత్తితో దాడి చేయడం, చంపేందుకు వెనుకాడని నైజం అతనిది. 10 మందితో కలిసి గ్యాంగ్ ఏర్పాటు చేసి, బైక్‌లను చోరీ చేసేవాడు. ఆ వాహనాలపై అత్తాపూర్, రాజేంద్రనగర్, చాంద్రాయణగుట్ట, పహాడిషరీఫ్ ప్రాంతాల్లో హల్‌చల్ చేసేవాడు. హైదరాబాద్ పరిధిలోని చాలా ప్రాంతాల్లో తల్వార్‌లతో దారిదోపిడీకి తెగబడేవారని ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
రాత్రి వేళల్లో ఔటర్‌రింగ్‌రోడ్డులో సెక్స్‌వర్కర్స్ కోసం కరణ్‌సింగ్ నిత్యం చక్కర్లు కొట్టేవారని, వారి వద్దకు వచ్చే విటులే టార్గెట్‌గా దారిదోపిడీ చేసేవాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. అత్తాపూర్ పరిధిలో కరణ్‌సింగ్‌పై ఇప్పటికే 5 కేసులు ఉన్నాయి. ఇందులో 3 కేసులు మైనర్‌గా ఉన్నప్పుడే నమోదయ్యాయి. కరీంనగర్ కారు కేసు, జగద్గిరిగుట్టలో మైనర్ బాలికకు వేధింపులు వీటిలో ప్రధానమైన కేసులు. ఇక అత్తాపూర్ పీఎస్‌లో కరణ్‌సింగ్‌పై రౌడీషీట్ ఉంది.
అత్తాపూర్ పరిధిలో కరణ్ సింగ్ పై 5 కేసులు.. ఇందులో 3 కేసులు మైనర్ గా ఉన్నప్పుడే నమోదయ్యాయని పోలీసులు వివరించారు. మత్తుపదార్థాలు తీసుకోవడం, అమ్మాయిలను వేధించడం, దాడిచేసి డబ్బులు, నగలు దోచుకోవడం కరణ్ సింగ్ ప్రవృత్తి అని పేర్కొన్నారు. కరీంనగర్ లో కారు చోరీ కేసు.. జగద్గిరిగుట్టలో ప్రేమ పేరుతో మైనర్ పై వేధింపులకు పాల్పడినట్లు తెలిపారు. మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని.. పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..