Viral: డాక్టర్.! ‘ప్లీజ్.. అమ్మానాన్నలకు చెప్పొద్దు’.. కన్నీళ్లు పెట్టిస్తోన్న చిన్నారి కథ..

చావు అంటేనే సరిగ్గా అర్థం తెలియని వయసులో ఆరేళ్ల చిన్నారి తన తల్లితండ్రుల సంతోషం గురించి ఆలోచించాడు. తనకేదైనా జరిగితే..

Viral: డాక్టర్.! 'ప్లీజ్.. అమ్మానాన్నలకు చెప్పొద్దు'.. కన్నీళ్లు పెట్టిస్తోన్న చిన్నారి కథ..
Child Cancer
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 07, 2023 | 9:48 AM

చావు అంటేనే సరిగ్గా అర్థం తెలియని వయసులో ఆరేళ్ల చిన్నారి తన తల్లితండ్రుల సంతోషం గురించి ఆలోచించాడు. తనకేదైనా జరిగితే వారు బాధ పడతారని భావించాడు. తనకు క్యాన్సర్ ఉన్న విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పొద్దంటూ వైద్యుడికి సూచించాడు. చివరకు లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. హైదరాబాద్‌ చిన్నారి ఉదంతం ఇప్పుడు వైరల్‌గా మారింది.

డాక్టర్ నాకు మెదడు క్యాన్సర్ ఉంది. మరి కొద్ది రోజుల కంటే ఎక్కువ కాలం బతకను. కానీ ఈ విషయాన్ని అమ్మానాన్నలకు చెప్పొద్దు..తెలిస్తే వారు తట్టుకోలేరంటూ ఆరేళ్ల బాలుడు వైద్యుడితో చెప్పాడు. ఆడిపాడుకునే వయసులో క్యాన్సర్‌ అంటే అర్థమే చిన్నారులకు తెలియదు. ఆరేళ్ల వయసులోనే ఆ చిన్నారి మనోధైర్యాన్ని ప్రదర్శించాడు. తనకేదో అవుతుందని భయపడకుండా తల్లిదండ్రుల గురించి ఆలోచించాడు.

కొన్ని నెలల క్రితం భార్యాభర్తలు ఆరేళ్ల వయసున్న బాలుడుతో తన దగ్గరికి వచ్చారని, బాలుడిని బయటే పెట్టి మొదట తనను కలిశారని, బాలుడికి క్యాన్సర్ ఉన్న విషయాన్ని ఆ చిన్నారితో చెప్పొద్దు అని ఆ తల్లిదండ్రులు డాక్టర్ని ప్రాధేయపడ్డారట.తర్వాత బాబుని లోపలికి తీసుకురాగా అన్ని మెడికల్ టెస్టులు చేసిన తర్వాత చిన్నారికి గ్లయోబ్లాస్టోమా మల్టీ ఫార్మీ అనే ఒక ప్రమాదకరమైన మెదడు క్యాన్సర్ నాలుగో దశలో ఉంది అని వైద్యుడు గుర్తించారట.

తను చనిపోతున్న విషయాన్ని పేరెంట్స్ కి చెప్పవద్దు అంటూ ఆరేళ్ల పిల్లాడు డాక్టర్ తో అన్న మాటలు పిల్లాడి పెద్ద మనసు అందరినీ ఆలోచింప చేస్తుంది.ఈ విషయాన్ని తన ట్విట్టర్ లో షేర్ చేశారు నూరాలజిస్ట్ సుధీర్. ఆ బాబు అలా అనడం తో నా తో పాటు అబ్బాయి తల్లి తండ్రులు షాక్ కి గురయ్యామని…చివరి క్షణాల్లో ఆనందంగా ఉంచాలని వారికి సూచించానని… ఆ పిల్లాడితో మాట్లాడిన మాటలని పంచుకున్నారు డాక్టర్ సుధీర్ కుమార్.