వాయమ్మో.. 5 లీటర్ల పెట్రోలు కేవలం 3 రూపాయలే.. కానీ అసలు విషయం తెలిస్తే నోరెళ్లబెట్టడం మాత్రం ఖాయం..

కాలక్రమేణా ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం నిత్యవసరాల ధరలు ఆకాశన్నంటున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని పాత బిల్లుల ఫొటోలు.. నెటిజన్లను నోరెళ్లబెట్టేలా చేస్తున్నాయి.

వాయమ్మో.. 5 లీటర్ల పెట్రోలు కేవలం 3 రూపాయలే.. కానీ అసలు విషయం తెలిస్తే నోరెళ్లబెట్టడం మాత్రం ఖాయం..
Petrol Price
Follow us

|

Updated on: Jan 05, 2023 | 1:57 PM

కాలక్రమేణా ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం నిత్యవసరాల ధరలు ఆకాశన్నంటున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని పాత బిల్లుల ఫొటోలు.. నెటిజన్లను నోరెళ్లబెట్టేలా చేస్తున్నాయి. అయితే, కాలంతో పాటు సంపాదన కూడా పెరిగిందని పలువురు అంటున్నారు. కాగా, గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పాత బిల్లుల ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఒక్కోసారి రెస్టారెంట్ లో ఫుల్ మీల్ తిన్న బిల్లు రూ.26, మరికొన్ని సార్లు ‘రాయల్ ఇన్ ఫీల్డ్’ బుల్లెట్ 350 సీసీ బైక్ ను రూ.19 వేలు పెట్టి కొన్న బిల్లు.. ఇలా ఎన్నో షేర్ అవుతున్నాయి. ఇంకా నెల కరెంటు బిల్లు రూ.5, రూ.18కి సైకిల్ కొన్న బిల్లులను చూసి జనాలు షాక్ అవుతున్నారు. ఇవన్నీ కొన్ని దశాబ్దాల నాటి బిల్లులు. ఇప్పుడు 1963 నాటి పెట్రోల్ పంపు రసీదు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఐదు లీటర్ల పెట్రోల్ ధర రాసి ఉంది. అయితే.. దీన్ని చూసి చాలా మంది వామ్మో అంటున్నారు. ఎందుకంటే.. ఈ రోజు 1 లీటర్ ఆయిల్ ధరలో.. అప్పట్లో 100 లీటర్ల కంటే ఎక్కువ పెట్రోల్ కొనుగోలు చేయొచ్చన్నమాట..

సోషల్ మీడియాలో భారత్ పెట్రోల్ సప్లై కో రశీదు వైరల్ అవుతోంది. ఇది 2 ఫిబ్రవరి 1963 నాటిది. వాహనంలో ఇంధనాన్ని నింపిన తర్వాత పెట్రోల్ పంపు బిల్లును ఇచ్చింది. ఇందులో ఐదు లీటర్ల పెట్రోల్ ధర కేవలం రూ.3 రూపాయల 60 పైసలు రాసి ఉంది. దీని ప్రకారం లీటర్ పెట్రోల్ ధర 72 పైసలు మాత్రమే.. దీంతో ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఈ ఫొటో 2015 సంవత్సరం నాటి నుంచి ట్విట్టర్ సహా పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ అవుతోంది.

పెట్రోల్ ధర ఫొటో..

Petrol Bill

Petrol Bill

బుల్లెట్ బండి.. ధర..

మోటార్‌సైకిల్ బిల్లు ఫోటో డిసెంబర్ 13న Instagram పేజీ royalenfield_4567k లో షేర్ చేశారు. దీనిలో జనవరి 23 1986లో రాయల్ ఇన్ ఫీల్డ్ 350cc అనే బైక్ కొన్నట్లు బిల్లు రాసి ఉంది. బిల్లు ప్రకారం, ఆ సమయంలో 350 సిసి బుల్లెట్ మోటార్‌సైకిల్ ఆన్-రోడ్ ధర రూ. 18,800. తగ్గింపు తర్వాత రూ. 18,700కి విక్రయించారు.

ఇవి కూడా చదవండి
Bullet Price

Bullet Price

సైకిల్ ధర..

ఫేస్‌బుక్ యూజర్ సంజయ్ ఖరే సైకిల్ బిల్లు చిత్రాన్ని నవంబర్ 27న షేర్ చేశారు. ఒకప్పుడు ‘సైకిల్’ అనేది మా తాతగారి కల.. సైకిల్ చక్రం లాగా, కాలచక్రం ఎంత తిరిగిందో చూడండి.. 88 ఏళ్ల నాటి కింద సైకిల్ ధర రూ.18 మాత్రమే అంటూ కోల్‌కతాకు చెందిన యూజర్‌ పేర్కొన్నాడు.

Cycle

Cycle

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..