Video Viral: అట్లుంటది మరి అన్నా చెల్లెళ్ల ప్రేమంటే.. చిన్నారి చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. మీరూ చూసేయండి..
ఈ సృష్టిలో అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ఉన్న సంబంధం చాలా బలమైనది. ఒకే ఇంట్లో కలిసి పెరిగే తోబుట్టువుల మధ్య ప్రేమానురాగాలను మాటల్లో చెప్పలేం. ఒకరికి కష్టం వస్తే మరొకరు తట్టుకోలేరు. వారికే ఆ కష్టం...
ఈ సృష్టిలో అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ఉన్న సంబంధం చాలా బలమైనది. ఒకే ఇంట్లో కలిసి పెరిగే తోబుట్టువుల మధ్య ప్రేమానురాగాలను మాటల్లో చెప్పలేం. ఒకరికి కష్టం వస్తే మరొకరు తట్టుకోలేరు. వారికే ఆ కష్టం వచ్చిందా అన్నట్లు తల్లడిల్లిపోతుంటారు. అమ్మలో సగం, నాన్నలో సగం.. అన్న.. అమ్మలా ప్రేమను పంచినా, నాన్నలా బతుకును తీర్చిదిద్దినా అది అన్నకే సాధ్యం. అందుకే భారతదేశంలో రక్షా బంధన్‌కి అంత ప్రాముఖ్యత సంతరించుకుంది. అయితే.. సోషల్ మీడియాలో సోదరీ సోదరులకు సంబంధించిన చాలా వీడియోలు ఉన్నాయి. చాలా వరకు ఇవి ఎమోషనల్ గా ఉంటాయి. కానీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఓ వీడియో అన్నాచెల్లెల బంధానికి అద్దం పడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ముగ్దులైపోతున్నారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ బాలుడు తన చిన్నారి చెల్లిని సైకిల్‌పై కూర్చోబెట్టుకున్నాడు. తాను సైకిల్ తొక్కేటప్పుడు ఎక్కడ చెల్లి కిందపడిపోతుందోనని ఆ చిన్నారికి వెనుక ఒక బియ్యం మూటలాంటిది అడ్డుగా పెట్టాడు. అంతేకాదు, చెల్లి తన కాళ్లను ఎక్కడ సైకిల్ చక్రాల్లో పెట్టేస్తుందోనని తన కాళ్లను సైకిల్ ముందు భాగానికి ఉండే రాడ్‌కు తన టవల్‌తో కట్టి ఎంతో భద్రంగా చెల్లిని ఇంటికి తీసుకెళ్లాడు. హృదయాన్ని కదిలిస్తున్న ఈ వీడియోను ఓ యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేస్తూ…’సో స్వీట్ బ్రదర్స్ లవ్’ అంటూ కాప్షన్ ఇచ్చారు.
Brother’s Love pic.twitter.com/rATH1A83my
— Urdu Novels (@urdunovels) January 2, 2023
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను 14 వేలమందికి పైగా వీక్షించారు. అన్నా చెల్లెళ్ల బంధం సో బ్యూటిఫుల్ అని కొందరు, చెల్లిపైన సోదరుడి స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనం అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..