అత్తాకోడళ్ల దారుణ హత్య..
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ప్రాంతంలో అర్థరాత్రి జంట హత్యలు కలకలం రేపాయి. పాతబస్తీలోని వట్టేపల్లిలో అత్తా, కోడలిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. అత్త ఫబీహా బేగం, కోడలు తయ్యబా బేగంలను తల్వార్లతో అత్యంత దారుణంగా నరికి చంపారు. అనంతరం దుండగులు బీరువా నుంచి బంగారు ఆభరణాలను అపహరించుకుపోయినట్టు తెలుస్తోంది. అయితే.. తమకు ఎవరితో శతృత్వం లేదని, ఎవరు హత్య చేశారో తెలియదని మృతుల కుటుంబీకులు, బంధువులు చెబుతున్నారు. ఇద్దరిని హత్య చేయడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. […]
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ప్రాంతంలో అర్థరాత్రి జంట హత్యలు కలకలం రేపాయి. పాతబస్తీలోని వట్టేపల్లిలో అత్తా, కోడలిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. అత్త ఫబీహా బేగం, కోడలు తయ్యబా బేగంలను తల్వార్లతో అత్యంత దారుణంగా నరికి చంపారు. అనంతరం దుండగులు బీరువా నుంచి బంగారు ఆభరణాలను అపహరించుకుపోయినట్టు తెలుస్తోంది. అయితే.. తమకు ఎవరితో శతృత్వం లేదని, ఎవరు హత్య చేశారో తెలియదని మృతుల కుటుంబీకులు, బంధువులు చెబుతున్నారు. ఇద్దరిని హత్య చేయడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు క్లూస్‌టీం, డాగ్‌స్వ్కాడ్‌తో పరిసరాలను పరిశీలించారు. శంషాబాద్ డీసీసీ ప్రకాశ్‌గౌడ్ హత్యలు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.