AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రణయ్ హత్య కేసు.. వీళ్లు మామూలోళ్లు కాదు బాబోయ్‌.. కోర్టులను కూడా బురిడీ కొట్టించే ఘనులు..!

హత్య కేసుల్లో సుపారి కిల్లర్స్.. పోలీసులనే ముప్పుతిప్పల పెట్టి మూడు చెరువుల నీరు తాగిస్తుంటారు. ఇపుడు సూపర్ కిల్లర్స్ కు మించి కొందరు కోర్టులను కూడా మోసగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓ కేసులో కోర్టులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేసి చివరికి కటకటాల పాలయ్యారు. దీంతో సంచలనం సృష్టించిన ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. కోర్టులనే బురిడీ కొట్టించిన ఘరానా మోసగాళ్ల గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ప్రణయ్ హత్య కేసు.. వీళ్లు మామూలోళ్లు కాదు బాబోయ్‌.. కోర్టులను కూడా బురిడీ కొట్టించే ఘనులు..!
Pranay Murder Case
M Revan Reddy
| Edited By: |

Updated on: Jan 12, 2025 | 9:22 AM

Share

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో 2018 సంవత్సరంలో ప్రణయ్ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించింది. ఎనిమిదేళ్లుగా విచారణ కొనసాగుతున్న ఈ కేసు ఫైనల్ దశకు చేరుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా బీహార్ కు చెందిన సుపారి కిల్లర్ సుభాష్ శర్మ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. సుభాష్ శర్మకు బెయిల్ ఇస్తే విచారణకు ఆటంకం కలుగుతుందని పోలీసులు కోర్టుకు వివరించడంతో.. కొంతకాలంగా బెయిల్ నిరాకరిస్తున్నారు. కాగా 2024 నవంబర్ లో బెయిల్ మంజూరు చేయాలని సుభాష్ శర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో షూరిటీలను సమర్పించి జిల్లా కోర్టులో బెయిల్ పొందాల్సిందిగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

సుభాష్ శర్మకు షూరిటీ ఇచ్చేందుకు ముగ్గురు ముందుకు వచ్చారు. కేతపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన వంగాల సైదులు, మాడుగుల పల్లి మండలం పాములపాడుకు చెందిన చింతచెర్ల దేవయ్య, ముక్కామల మల్లేష్ లు ఫోర్జరీ షూరిటీ పత్రాలను తయారు చేసి కోర్టుకు సమర్పించారు. ఈ షూరిటీ పత్రాలపై అనుమానం వచ్చిన పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు షూరిటీ పత్రాలపై విచారణ చేపట్టారు. సుభాష్ శర్మ బెయిల్ కోసం కోర్టుకు సమర్పించిన షూరిటీ పత్రాలు నకిలీ పత్రాలుగా పోలీసులు గుర్తించారు. కోర్టును మోసం చేయడంతో పాటు ఫోర్జరీ సంతకాలతో నకిలీ పోత్రాలను సృష్టించినందుకు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు తెలిపారు.

కాగా నకిలీ షూరిటీ పత్రాలలో ప్రధాన నిందితుడు వంగాల సైదులుపై వివిధ పోలీస్ స్టేషన్లలో 21 కేసులు నమోదు అయినట్లు ఆయన చెప్పారు. మిగిలిన ఇద్దరు కూడా నేర చరిత్రను కలిగిన వారు కావడంతో..పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి కోర్టుకు అందజేయనున్నట్లు డిఎస్పి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..