AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓర్నీ ఇదెక్కడి వింతనగరంరా బాబు.. ఇక్కడ శీతాకాలంలో ఆగిన కారు.. వచ్చే వేసవిలోనే స్టార్ట్‌..!

ఇక్కడి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయంతో వణికిపోతున్నారు. ఇక్కడి ప్రజలు తమ కార్లను 24 గంటల పాటు స్టార్ట్‌ చేసిన ఆన్‌లోనే ఉంచుతారు. ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి కారు ఆపేశారంటే..అది తిరిగి వేసవికాలంలో మాత్రమే మళ్లీ స్టార్ట్ అవుతుంది. ఈ వార్త వినడానికి షాకింగ్‌గా ఉంది కదూ.. కానీ ఇదంతా నిజమేనండోయ్.. ఎక్కడంటే..

ఓర్నీ ఇదెక్కడి వింతనగరంరా బాబు.. ఇక్కడ శీతాకాలంలో ఆగిన కారు.. వచ్చే వేసవిలోనే స్టార్ట్‌..!
Yakutsk City Russia
Jyothi Gadda
|

Updated on: Jan 12, 2025 | 8:12 AM

Share

భారత్‌లో శీతాకాలం తీవ్రత కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా తీవ్రమైన చలి, చల్లని గాలుల కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. కానీ, ప్రపంచంలో -62 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే ఒక నగరం ఉందని మీకు తెలుసా..? ఇక్కడి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయంతో వణికిపోతున్నారు. ఇక్కడి ప్రజలు తమ కార్లను 24 గంటల పాటు స్టార్ట్‌ చేసిన ఆన్‌లోనే ఉంచుతారు. ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి కారు ఆపేశారంటే..అది తిరిగి వేసవికాలంలో మాత్రమే మళ్లీ స్టార్ట్ అవుతుంది. ఈ వార్త వినడానికి షాకింగ్‌గా ఉంది కదూ.. ఇది నిజంగా జరుగుతుందా అని మీరు ఆలోచిస్తున్నారు కదా.. అవుననే సమాధానం వస్తుంది.

అంటార్కిటికా ప్రపంచంలోనే అత్యంత శీతల ఖండం కావచ్చు.. కానీ ప్రపంచంలో అత్యంత శీతల నగరం అక్కడ లేదు. ప్రపంచంలోనే అత్యంత శీతల నగరం అనే టైటిల్ రష్యాలోని యాకుట్స్క్ పేరు మీద ఉంది. సైబీరియాలో ఉన్న యాకుట్స్క్ నగరం ఉష్ణోగ్రత -50 నుండి -60 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుంది. రష్యాలోని యాకుట్స్క్ నగరంలో నివసించే ప్రజల జీవితం అలాంటిది. శీతాకాలంలో అక్కడ ఉష్ణోగ్రత -60 డిగ్రీల వరకు ఉంటుంది. ఇక్కడ నివసించే ప్రజలు చలి నుండి తమను తాము రక్షించుకోవడానికి అనేక చర్యలు తీసుకుంటారు. ప్రజలు రాత్రిపూట కారు ఇంజన్‌ను స్టార్ట్‌ చేసి ఉంచుతారు. అలాచేస్తేనే అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే ఉపయోగంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

రష్యాలోని ఈ నగరంలో పొగమంచు కూడా గడ్డకట్టుకుపోయేంత చలి తీవ్రంగా ఉంటుంది. సాధారణంగా ఇక్కడ ఉష్ణోగ్రత శీతాకాలంలో -40 డిగ్రీలు ఉంటుంది, కానీ కొన్నిసార్లు ఇది -70 కి చేరుకుంటుంది. యాకుట్స్క్‌లో దాదాపు 3.36 లక్షల మంది నివసిస్తున్నారు. ఇక్కడ చాలా మంది డైమండ్ మైనింగ్ కంపెనీ కార్మికులు. ఇక్కడ భయంకరమైన చలి నమోదవుతుంది. థర్మామీటర్ -63 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంతకంటే ఎక్కువ చలిని కూడా చూశామని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ..
సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ..
సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత పాట
సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత పాట
ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!