Viral News: ఈ వ్యక్తి అసలు ఏ పని చేయడు.. ఏడాదికి 69 లక్షల సంపాదన.. ఎలాగంటే..

సంపాదించాలంటే ఏదైనా కష్టపడి పని చేయాల్సి.. లేదా తెలివి తేటలకు పని చెప్పాలి. అప్పుడే డబ్బులను సంపాదించగలం. అయితే ఒక వ్యక్తి ఏ పని చేయకుండా లక్షలు సంపాదిస్తున్నాడు. అవును జపాన్‌కు చెందిన షోజి మోరిమోటో సంపాదన వెలుగులోకి వచ్చిన తర్వాత షాక్ తిన్నారు. కొన్ని వందల గంటలు పనిచేస్తేనే శ్రమకు తగిన జీతం లేదంటూ మన దేశంలోని ప్రజలు వాపోతుంటే.. షోజీ ఏ పని చేయకుండానే ఏడాదిలో రూ.69 లక్షలు సంపాదిస్తున్నాడు.

Viral News: ఈ వ్యక్తి అసలు ఏ పని చేయడు.. ఏడాదికి 69 లక్షల సంపాదన.. ఎలాగంటే..
Japanese GuyImage Credit source: X/@morimotoshoji
Follow us
Surya Kala

|

Updated on: Jan 11, 2025 | 7:05 PM

భారత్‌లో ఎల్‌అండ్‌టి ఛైర్మన్‌ ఎస్‌ఎన్‌ సుబ్రమణియన్‌ ’90 గంటల పని’ చేయండి అని చేసిన ప్రకటనపై తీవ్ర దుమారం రేగుతోంది. అదే సమయంలో ఏ పని చేయకుండా ఏడాదికి రూ.69 లక్షలు సంపాదిస్తున్న వ్యక్తికి సంబంధించిన వార్త కూడా అంతే ఆసక్తి కలిగిస్తుంది. ఈ వ్యక్తి జపాన్‌లో ఉన్నాడు. అవును షోజీ మోరిమోటో అనే ఈ జపాన్ కు చెందిన వ్యక్తికి ప్రజలు స్వయంగా డబ్బు ఇస్తారు. ఇలా ఎందుకు చేస్తారో తెలుసుకుందాం..

41 ఏళ్ల షోజీ ఎలాంటి శారీరక శ్రమ లేకుండా లక్షల్లో సంపాదీస్తున్న వ్యక్తిగా జపాన్‌లో ప్రసిద్ధి చెందాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది అనే ప్రశ్న ఎవరి మదిలో అయిన తలెత్తవచ్చు. నిజానికి షోజీ ప్రత్యేక వ్యక్తిత్వమే అతని ఆదాయ వనరు. అలా ఎలా అని అనుకుంటున్నారా..

జపాన్‌లో ప్రత్యేకమైన అద్దె సేవా పరిశ్రమ ఉంది. అంటే ఎవరికైనా మంచి సహచరులు కావాలనుకుంటే అద్దెకు సహచరులను అందిస్తాది. షోజీ కూడా ఈ సేవ సంస్థలో సభ్యుడు. షోజీ మాట్లాడే విధానం చాలా పవర్‌ఫుల్‌గా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. దీంతో అతనితో సమయం గడపడానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు. 2018లో ఏ పని చేయడం లేదంటూ షోజీని ఉద్యోగం నుంచి తీసేశారు. అప్పుడు అతను ఈ అద్దె సేవా సంస్థలో సభ్యుడిగా మారాడు.

ఇవి కూడా చదవండి

షోజీ మాటల్లో అపరిచితుడు కూడా చాలా త్వరగా అతుక్కుపోయేంత మ్యాజిక్ ఉంటుందని చెబుతున్నారు. ఈ గుణమే అతడిని అద్దె సేవల ప్రపంచంలో విశేష ప్రాచుర్యం తీసుకొచ్చింది. షోజీ ప్రజలను కలవడం లేదా వారితో మాట్లాడడం ద్వారా డబ్బు తీసుకోవడమే కాదు.. ప్రతిరోజూ తన మొబైల్‌ ద్వారా 1000 మందికి పైగా అపరిచితుల నుంచి ఫోన్ కాల్స్ కూడా అందుకుంటాడు.

షోజీ కేవలం వ్యక్తులతో మాట్లాడటం ద్వారా ఒక సంవత్సరంలో 80,000 డాలర్లు (అంటే సుమారు రూ. 69 లక్షలు) సంపాదించాడు. ఎవరైనా విచారంగా ఉన్నప్పుడు.. వారిని ఓదార్చగల వ్యక్తి అవసరం అని అతను చెబుతాడు. అలా ఓదార్పు అవసరం అనుకున్న వ్యక్తులు షోజీని కలుసుకుని తమ భావాలను పంచుకుంటారు. అప్పుడు షోజీతో మాట్లాడిన తర్వాత మనసు తెలికినట్లు భావిస్తారు. అందుకనే అంతగా అతనికి డిమాండ్ ఉంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సైఫ్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్..అరెస్టైన వ్యక్తి నిందితుడు కాదా..?
సైఫ్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్..అరెస్టైన వ్యక్తి నిందితుడు కాదా..?
ఓవర్ నైట్‌లో స్టార్ అవ్వాల్సిన బ్యూటీ.. కానీ ఇప్పుడు
ఓవర్ నైట్‌లో స్టార్ అవ్వాల్సిన బ్యూటీ.. కానీ ఇప్పుడు
భారత్‌లో రియల్ ఎస్టేట్ దూకుడు..53% పెరిగిన విక్రయాలు!
భారత్‌లో రియల్ ఎస్టేట్ దూకుడు..53% పెరిగిన విక్రయాలు!
అక్కినేని నాగార్జున వదులుకున్న బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే!
అక్కినేని నాగార్జున వదులుకున్న బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే!
బియ్యం తినే అలవాటు ఉందా.. ఈ లోపాలే కారణం!
బియ్యం తినే అలవాటు ఉందా.. ఈ లోపాలే కారణం!
వైట్‌.. బ్లాక్.. మిరియాల్లో ఏ రకం ఆరోగ్యానికి మేలు చేస్తాయ్!
వైట్‌.. బ్లాక్.. మిరియాల్లో ఏ రకం ఆరోగ్యానికి మేలు చేస్తాయ్!
దయచేసి మమ్మల్ని వదిలేయండి.. కరీనా కన్నీటి ఆవేదన..ఏం జరిగిందంటే?
దయచేసి మమ్మల్ని వదిలేయండి.. కరీనా కన్నీటి ఆవేదన..ఏం జరిగిందంటే?
ఒకేసారి డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు ఎంపికైన ఆరుగురు అమ్మాయిలు..!
ఒకేసారి డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు ఎంపికైన ఆరుగురు అమ్మాయిలు..!
అమెరికా అధ్యక్ష భవనంలో స్పెషల్ బటన్.. ఏంటది..? ఎందుకు?
అమెరికా అధ్యక్ష భవనంలో స్పెషల్ బటన్.. ఏంటది..? ఎందుకు?
ప్రియురాలితో కలిసి పెళ్లిపీటలెక్కిన ప్రముఖ డైరెక్టర్.. ఫొటోస్
ప్రియురాలితో కలిసి పెళ్లిపీటలెక్కిన ప్రముఖ డైరెక్టర్.. ఫొటోస్