గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్.. సత్తా చూపిన సినిమాలేవంటే?

ట్రిపుల్ ఆర్‌కు ఆస్కార్ వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ అవార్డ్స్‌పై ఇండియాలోనూ చర్చ బాగా జరుగుతుంది. తాజాగా 82వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సవం కాలిఫోర్నియాలో అట్టహాసంగా జరిగింది. ఈసారి ఇండియన్ సినిమాకు నిరాశే ఎదురైంది. మరి గోల్డెన్ గ్లోబ్‌లో సత్తా చూపించిన సినిమాలేంటి..? వాటి ముచ్చట్లేంటి..?

Samatha J

|

Updated on: Jan 11, 2025 | 2:30 PM

గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్ కాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్స్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు ప్రపంచ నలుమూలల నుంచి సినీ ప్రముఖులు హాజరయ్యారు. స్టాండప్‌ కమెడియన్‌ నక్కీ గ్లేజర్‌ హోస్ట్ చేసారు. 82వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా సెబాస్టియన్ స్టాన్ నిలిచారు. ఎ డిఫెరెంట్ మ్యాన్ సినిమాలో నటనకు గానూ గోల్డెన్ గ్లోబ్ వచ్చింది.

1 / 4
62 ఏళ్ళ డెమీ మూరేకు ఉత్తమ నటి అవార్డు వచ్చింది. ది సబ్‌స్టాన్స్‌లో ఈమె అద్భుత నటనకు గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కింది. అలాగే ఉత్తమ దర్శకుడిగా ది బ్రూటలిస్ట్ సినిమాకు గానూ బ్రాడీ కార్బెట్ ఎంపికయ్యారు. ఇక ఉత్తమ చిత్రంగా ఎమిలియా పెరేజ్, ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్‌గా పీటర్ స్ట్రాగన్, ఉత్తమ యానిమేటెడ్ చిత్రంగా ఫ్లో ఎంపికయ్యాయి.

2 / 4
ఉత్తమ చిత్రంగా నిలిచిన ‘ఎమిలియా పెరెజ్‌’ 10 నామినేషన్లు దక్కించుకొని.. 4 అవార్డులు సొంతం చేసుకుంది. ఈసారి గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఇండియన్ సినిమాకు నిరాశే ఎదురైంది.

3 / 4
 పాయల్‌ కపాడియా తెరకెక్కించిన ‘ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్ లైట్‌’ ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం రెండు కేటగిరీల్లో పోటీ పడినా అవార్డు దక్కలేదు.

4 / 4
Follow us