రూ.25 కోట్ల సాంగ్ ను.. అలా లేపేశారేంటి?

ఓ సినిమా లెన్త్‌ ఎక్కువైతే సీన్లు కట్ చేస్తారు.. సాంగ్ కట్ చేస్తారు.! అది కామనే! అయితే ఈ కామన్ థింగే ఇప్పుడు మెగా అభిమానులను విపరీతంగా డిస్సపాయింట్ చేస్తోంది. డైరెక్టర్ శంకర్ అలా చేయకపోతే బాగుండు అనే కామెంట్ వస్తోంది.ఇక అసలు విషయం ఏంటంటే..! డైరెక్టర్ శంకర్.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా భారీ బడ్జెట్‌తో గేమ్‌ ఛేంజర్ సినిమా చేశారు.

Follow us
Samatha J

|

Updated on: Jan 11, 2025 | 7:31 PM

 ఈ సినిమాలో ఓన్లీ సాంగ్స్ కోసమే 75 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు. అందులోనూ నా నా హైరానా సాంగ్‌కు దాదాపు 25 కోట్లు ఖర్చు పెట్టినట్టు చెప్పారు. అయితే ఈ సాంగే ఇప్పుడు గేమ్‌ ఛేంజర్ సినిమాలో మిస్‌ అయింది.సినిమా నిడివి పెరగడమే కారణమో.. లేక సిట్యుయేషన్ కుదరలేదో తెలియదు కానీ.. గేమ్‌ ఛేంజర్ నుంచి ఈ సాంగ్‌ను తీసేసిందట శంకర్ టీం. ఇక ఈ విషయం తెలియని మెగా ఫ్యాన్స్‌.. సినిమా ఎండ్ అయినా.. హైరానా సాంగ్‌ రాకపోవడంతో.. డిస్సపాయింట్ అయ్యారు. బయటికొచ్చి వారి అసహనాన్ని తెలియజేస్తున్నారు. 25 కోట్ల సాంగ్‌ను.. తమన్ కంపోజ్ చేసిన వన్ ఆఫ్ ది బెస్ట్ మెలోడీ సాంగ్‌ను, అలా సిల్లీగా.. సినిమా నుంచి తీసేయడం ఏంటని నెట్టింట పోస్టులు పెడుతున్నారు.