గుడి కట్టి పూజలు చేస్తున్న అభిమాని.. రజనీకాంత్ ఇచ్చిన గిఫ్ట్ ఏమిటంటే?
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. అందులో మధురై జిల్లా తిరుమంగళానికి చెందిన కార్తీక్ కూడా ఒకరు. సైనికుడిగా సరిహద్దులో సేవలందించి రిటైరైన అతనికి రజనీకాంత్ అంటే చెప్పలేని అభిమానం. తన ఫేవరెట్ హీరోకు మనసులో గుడి కట్టేసుకున్న కార్తీక్ ఇటీవలే ఏకంగా తన ఇంట్లోనూ గుడి కట్టేశాడు. అంతేకాకుండా రజనీ విగ్రహం ఏర్పాటు చేసి నిత్యం పూజలు చేస్తున్నాడు.
ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో.. ఇప్పుడీ విషయం సూపర్ స్టార్ రజనీ కాంత్ దాకా వెళ్లింది. ఈ విషయం తెలిసిన ఆయన తనకు గుడి కట్టించిన వీరాభిమాని కార్తీక్ అతని కుటుంబ సభ్యులను చెన్నై, పోయస్ గార్డెన్‌లోని తన ఇంటికి పిలిపించారు. తన అభిమాని కుటుంబంతో ప్రత్యేకంగా ముచ్చటించారు. అలాగే బాబా విగ్రహాన్ని కానుకగా తన అభిమానికి అందించారు రజినీకాంత్. చివరిగా వారికి రుచికరమైన వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ ఫోటోలు కూడా ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. దీనిని చూసిన రజనీకాంత్ అభిమానులు తమ హీరోతో పాటు కార్తీక్ పైనా ప్రశంసలు కురిపిస్తున్నారు.
Published on: Jan 11, 2025 07:39 PM
Follow Us
వైరల్ వీడియోలు
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్

