Supreme Court Jobs: నెలకు రూ.80 జీతంతో సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఎవరు అర్హులంటే

దేశ రాజధాని ఢిల్లీలోని అత్యున్న న్యాయస్థానం సుప్రీం కోర్టులో ఉద్యోగాలకు ప్రకటన వెలువడింది. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీలో అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి కలిగిన వారు ఆన్ లైన్ విధానంలో జనవరి 14వ తేదీ నుంచి అధికారిక వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఈ కింద తెలుసుకోవచ్చు..

Supreme Court Jobs: నెలకు రూ.80 జీతంతో సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఎవరు అర్హులంటే
Supreme Court
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 12, 2025 | 10:05 AM

దేశ రాజధాని న్యూఢిల్లీలోని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో.. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న లా క్లర్క్-కమ్-రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 90 లా క్లర్క్-కమ్-రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 7, 2025వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

సుప్రీంకోర్టులో లా క్లర్క్-కమ్-రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు.. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో లా కోర్సులో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. దీనితో పాటు సంబంధిత పనిలో అనుభవం కూడా కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి ఫిబ్రవరి 7, 2025వ తేదీ నాటికి 20 నుంచి 32 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ జనవరి 14, 2025వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 7, 2025వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.500 చొప్పున రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.80,000 చొప్పున వేతనం చెల్లిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు విశాఖపట్నం, హైదరాబాద్‌లలో కేటాయిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జనవరి 14, 2025.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: ఫిబ్రవరి 7, 2025.
  • ఆన్‌లైన్‌ రాత పరీక్ష తేదీ: మార్చి 09, 2025.
  • పరీక్ష జవాబుల కీ విడుదల తేదీ: మార్చి 10, 2025.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.