Xiaomi pad 7: అదరగొడుతున్న ఎంఐ ప్యాడ్‌ 7.. ఎట్టకేలకు భారత్‌లో విడుదల

పెరిగిన టెక్నాలజీ కారణంగా నేడు ప్రతి పనిలోనూ కంప్యూటర్‌ అవసరమవుతోంది. చదువు, ఉద్యోగం, వ్యాపారం తదితర అన్ని రంగాలలో వినియోగం పెరిగింది. అయితే కంప్యూటర్లతో ఇంటిలోనో, ఆఫీసులోనో మాత్రమే పనిచేయగలం. దీంతో మినీ కంప్యూటర్లుగా భావించే ప్యాడ్‌ల వాడకం ఎక్కువైంది. వీటిని మనతో పాటు ఎక్కడికైనా తీసుకువెళ్లవచ్చు. ప్రయాణం సమయంలోనూ వినియోగించుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా మార్కెట్‌ లోని ఎంఐ ప్యాడ్‌ 7 విడుదలైంది. దీని ప్రత్యేకతలు, ధర వివరాలు తెలుసుకుందాం.

Xiaomi pad 7:  అదరగొడుతున్న ఎంఐ ప్యాడ్‌ 7.. ఎట్టకేలకు భారత్‌లో విడుదల
Xiaomi Pad 7
Follow us
Srinu

|

Updated on: Jan 12, 2025 | 9:30 AM

ఎంఐ ప్యాడ్‌ 7లో 11.2 అంగుళాల 3.2 కే డిస్‌ ప్లే, స్నాప్‌ డ్రాగన్‌ 7 ప్లస్‌ జెన్‌ చిప్‌ సెట్‌, ఫోకస్‌ కీ బోర్డు, పెన్‌ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. నానో టెక్స్చర్‌ గ్లాస్‌ డిస్‌ ప్లే అదనపు ప్రత్యేకత. దీని కారణంగా కళ్ల మీద ఒత్తిడి లేకుండా ఉంటుంది. ఈ ప్యాడ్‌ గతేడాది చైనాలో విడుదలైంది. దాదాపు ఏడాది అనంతరం మన దేశంలో ఆవిష్కరించారు. గతంలో విడుదలైన ప్యాడ్‌ల కంటే మెరుగైన పనితీరు కలిగి ఉంది. నానా టెక్స్చర్‌ డిస్‌ ప్లే, 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజీతో ఫైల్స్‌ నిల్వ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా నానా టెక్స్చర్‌ డిస్‌ ప్లే దీనికి అదనపు ప్రత్యేకత. అది లక్షరూపాయల కంటే ఖరీదైన ఐప్యాడ్‌ ప్రో వంటి వాటిలో ఉండేది. ప్రస్తుతం తక్కువ ధర ప్యాడ్‌లోనే అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఎంఐ ప్యాడ్‌ 7 మూడు రకాల కాన్పిగరేషన్లలో విడుదలైంది. 8 జీబీ, 128 జీబీ స్టోరేజీ వేరియంట్‌ రూ.26,999, అలాగే 12 జీబీ, 256 జీబీ స్టోరేజీ వేరియంట్‌ రూ.29,999, మిగిలిన 12 జీబీ, 256 జీబీ స్టోరేజీ కలిగిన నానో టెక్స్చర్‌ గ్లాస్‌ డిస్‌ ప్లే వేరియంట్‌ రూ.31,999కి లభిస్తుంది. వీటిపై వెయ్యి రూపాయల బ్యాంకు ఆఫర్‌ కూడా వర్తింపజేస్తున్నారు. గ్రాఫైట్‌ గ్రే, మిరాజ్‌ పర్పుల్‌, సేజ్‌ గ్రీన్‌ అనే మూడు రకాల రంగుల్లో షియోమి ప్యాడ్‌ 7 అందుబాటులో ఉంది. ఇక యాక్సెసరీలకు సంబంధించి ఎంఐ ప్యాడ్‌ ఫోకస్‌ కీబోర్డు రూ.4,999, ఎంఐ ప్యాడ్‌ కవర్‌ రూ.1,499, ఫోకస్‌ పెన్‌ రూ.5,999, ఎంఐ ప్యాడ్‌ 7 ప్రో ఫోకస్‌ కీబోర్డు రూ.8,999కి అందుబాటులో ఉన్నాయి. ప్యాడ్‌ 7 విక్రయాలు జనవరి 13 నుంచి మొదలవుతాయి. ప్యాడ్‌ 7 నానో టెక్చర్‌ గ్లాస్‌ డిస్‌ప్లే, ప్యాడ్‌ 7 ఫోకస్‌ పెన్‌, ప్యాడ్‌ 7 ప్రో ఫోకస్‌ కీబోర్డు ఫిబ్రవరి నుంచి అమెజాన్‌, ఎంఐ అధికారిక వెబ్‌సైట్స్‌లో  లభిస్తాయి.

ఎంఐ ప్యాడ్‌ 7లో 11.2 అంగుళాల డిస్‌ ప్లే ఏర్పాటు చేశారు. చదవడానికి, బ్రౌజింగ్‌ చేయడానికి, మల్టీ మీడియా వినియోగానికి చాలా అనుకూలంగా ఉంటుంది. డాల్బీ ఆట్మోస్‌, హౌరెస్‌ ఆడియోకు మద్దతు ఇచ్చే క్వాడ్‌ స్పీకర్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేశారు. ఈ ప్యాడ్‌ కేవలం 500 గ్రాముల బరువు ఉండడంతో ఎక్కడికైనా చాలా తేలికగా తీసుకుపోవచ్చు. అలాగే పోర్టబుల్‌ కారణంగా చాలా తక్కువ స్థలంలో భద్రపర్చవచ్చు. 45 డబ్ల్యూ ఫాస్ట్‌ చార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 8,850 ఏఎంహెచ్‌ బ్యాటరీ కారణంగా చార్జింగ్‌ సమస్య ఉండదు. ప్యాడ్‌ లోని ఫోన్‌ పెన్‌ చాలా ఉపయోగంగా ఉంటుంది. డ్రాయింగ్‌, రైటింగ్‌ లో ప్రయోజకరంగా ఉంటుంది. ఫోకస్‌ కీబోర్డుతో టైపింగ్‌ విధానం మెరుగవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి