Jio Recharge: రెండేళ్లపాటు యూట్యూబ్ ప్రీమియం ఫ్రీ.. ఆ యూజర్లకు జియో బంపర్ ఆఫర్
భారతదేశ టెలికం మార్కెట్ రంగంలో జియో అంటే సంచలనం. ఓ రకంగా చెప్పాలంటే భారతదేశంలో మొబైల్ ఇంటర్నెట్ విప్లవానికి కారణం జియోనే అంటూ కొంత మంది నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే జియో కూడా ఎప్పటికప్పుడు యూజర్లను ఆకట్టుకుే ఎయిర్ ఫైబర్, పోస్ట్ పెయిడ్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఓ కొత్త ప్లాన్‌ను ప్రకటించింది.
భారతదేశంలో ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వాడే వారి సంఖ్య భారీగా పెరిగింది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ యూజర్లు కచ్చితంగా యూట్యూబ్ వాడుతున్నారు. అయితే ఈ యూట్యూబ్ చూస్తున్నప్పుడు యాడ్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. యాడ్ ఫ్రీ యూట్యూబ్‌ను ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే తాజాగా జియో తన పోస్ట్ పెయిడ్, జియో ఎయిర్ ఫైబర్ వినియోగదారులకు రెండేళ్ల పాటు ఫ్రీగా యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ అందిస్తున్నట్లు ప్రకటించింది. భారతదేశవ్యాప్తంగా ఉన్న సబ్‌స్క్రైబర్ల కోసం డిజిటల్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఈ ప్లాన్ రూపొందించామని జియో ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్ జియో ఎయిర్ ఫైబర్, జియో ఫైబర్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. రూ.888, రూ.1199, రూ.1499, రూ.2499, రూ.3499 ప్లాన్‌లను యాక్టివేట్ చేసుకుంటే యూట్యూబ్ ప్రీమియం అనుభవాన్ని ఆశ్వాదించవచ్చు.
యూట్యూబ్ ప్రీమియమ్ సబ్‌స్క్రిప్షన్ యాక్టివేషన్ ఇలా
- ముందుగా పైన పేర్కొన్న ప్లాన్స్ ఏదో ఒక ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవాలి.
- అనంతరం మై జియో యాప్‌లో మీ అకౌంట్ లో లాగిన్ అవ్వాలి.
- అక్క పేజీలో కనిపించే యూట్యూబ్ ప్రీమియమ్ బ్యానర్‌పై క్లిక్ చేయాలి.
- అక్కడ మీ యూట్యూబ్ ఖాతాతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
- అదే వివరాలతో జియో ఫైబర్ లేదా జియో ఎయిర్ ఫైబర్ సెటప్ టాప్ బాక్స్‌లో లాగిన్ అయితే వెంటే యూట్యూబ్ యాడ్-ఫ్రీ కంటెంట్‌ను ఆశ్వాదించవచ్చు.
యూట్యూబ్ ప్రీమియం ప్రత్యేకతలివే
- యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రైబర్లు ఎలాంటి అడ్వర్టైజెంట్ బ్రేక్ లేకుండా యూట్యూబ్ కంటెంట్‌ను ఆశ్వాదించవచ్చు.
- అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఎప్పుడైనా ఆఫ్‌లైన్ వీడియో ఆశ్వాదించవచ్చు. అలాగే కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- ఇతర యాప్స్ ఉపయోగిస్తున్నా లేదా స్క్రీన్ ఆఫ్ అయినప్పటికీ బ్యాక్‌గ్రౌండ్ ప్లే ద్వారా వీడియోలు చూడవచ్చు. అలాగే సంగీతం కూడా వినవచ్చు.
- యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియమ్ ద్వారా 100 మిలియన్ల కంటే ఎక్కువ పాటల యాడ్-ఫ్రీ లైబ్రరీ, వ్యక్తిగత ప్లేలిస్ట్‌లు, గ్లోబల్ చార్ట్-టాపర్ల వంటి ఫీచర్లను పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి