Anand Mahindra: ఎన్ని గంటలనేది కాదు.. ఉద్యోగుల పని గంటలపై అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా

ఎల్ అండ్ టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఉద్యోగుల పని గంటలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆన్‌లైన్‌ వేధికగా విస్తృత చర్చలు, ప్రజల ఆగ్రహాన్ని రేకెత్తించేలా చేశాయి. పని గంటల పరిమాణాన్ని నొక్కిచెప్పడం వల్ల జరుగుతున్న చర్చ తప్పు అని అన్నారు. ఎల్ అండ్ టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఇతరులపై తనకు చాలా గౌరవం ఉందని చెప్పారు. కాబట్టి, తాను చెప్పిన మాటలను వారు తప్పుగా భావించవద్దు అన్నారు.. కానీ తాను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అంటూ..

Anand Mahindra: ఎన్ని గంటలనేది కాదు.. ఉద్యోగుల పని గంటలపై అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా
Anand Mahindra
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 12, 2025 | 10:14 AM

ఎల్ అండ్ టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఉద్యోగుల పని గంటలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆన్‌లైన్‌ వేధికగా విస్తృత చర్చలు, ప్రజల ఆగ్రహాన్ని రేకెత్తించేలా చేశాయి. సోషల్ మీడియాలో ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రముఖ నటి దీపిక పదుకొనె, ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంక కూడా సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమేనంటూ కౌంటర్ ఇచ్చారు. గతంలో ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణ మూర్తి కూడా వారానికి 70 గంటల పాటు పనిచేయాలని చెప్పిన మాటలు కూడా ప్రజల్లో చర్చకు దారి తీశాయి. ప్రస్తుతం ఈ అంశంపై తీవ్రస్థాయిలోనే చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆనంద్ గ్రూప్స్‌ ఛైర్మన్.. ఆనంద్‌ మహింద్రా స్పందించారు. అసలు సమస్య ఎన్ని గంటలు పని చేశారనేది కాదు.. అవుట్‌ పుట్‌ నాణ్యత ముఖ్యమని అన్నారు. ఇది 40 గంటలు, 70 గంటలు లేదా 90 గంటలు కాదన్నారు. తాను పనిలో నాణ్యతను చూస్తానని.. పని సమయాన్ని కాదని పేర్కొన్నారు.

ఈ మేరకు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన విక్షిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025లో ఆయన మాట్లాడారు. పనిలో క్వాంటిటీ లేకపోయినా క్వాలిటీ ఉండాలని చెప్పారు. పని గంటల పరిమాణాన్ని నొక్కిచెప్పడం వల్ల జరుగుతున్న చర్చ తప్పు అని అన్నారు. ఎల్ అండ్ టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఇతరులపై తనకు చాలా గౌరవం ఉందని చెప్పారు. కాబట్టి, తాను చెప్పిన మాటలను వారు తప్పుగా భావించవద్దు అన్నారు.. కానీ తాను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అంటూ..పని గంటల చర్చ తప్పుడు దిశగా వెళ్తోందని తాను భావిస్తున్నట్టుగా యవతకు పిలుపునిచ్చారు ఆనంద్ మహీంద్రా.

ఇవి కూడా చదవండి

“నా ఉద్దేశ్యం ఏమిటంటే, మనం పని నాణ్యతపై దృష్టి పెట్టాలి, పని పరిమాణంపై కాదు. కాబట్టి ఇది 48, 40 గంటలు కాదు, 70 గంటలు కాదు, 90 గంటలు కాదు” అని ఆనంద్ మహీంద్రా చెప్పారు. ఇది వర్క్ అవుట్‌పుట్‌పై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. “10 గంటలు అయినా మీరు ఏమి అవుట్‌పుట్ చేస్తున్నారు? మీరు 10 గంటల్లో ప్రపంచాన్ని మార్చగలరు అని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..