మీ డైట్‎లో బెండకాయ.. అనారోగ్యానికి ఎండ్ కార్డ్.. 

TV9 Telugu

12 January 2025

బెండకాయలో విటమిన్‌-సి, యాంటీ ఆక్సిడెంట్స్‌, మాంగనీస్‌, మెగ్నీషియం, ఐరన్‌, క్యాల్షియం పుష్కలంగా ఉన్నాయి.

బెండకాయలను తరచూ తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు పోషకాహార నిపుణలు, వైద్యులు.

బెండలో పెక్టిన్‌ అనే ఫైబర్‌ ఉంటుంది. ఇది నీటిలో కరుగుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

బెండలో అధికంగా లభించే ఫైబర్‌ పేగులను శుభ్రం చేస్తుంది. ఫలితంగా, పేగులకు సంబంధించిన జబ్బుల ముప్పు తొలగిపోతుంది.

బెండలో ప్రొటీన్‌ అంత ఎక్కువగా ఉండదు. కానీ ఇందులో ఉండే కొంచెం ప్రొటీన్‌ అయినా శరీరానికి అవసరం అయ్యేదే.

ఆస్తమాతో బాధపడుతున్న వాళ్లు బెండకాయలు తింటే మంచిది. దీంతో ఉపశమనం కలుగుతుంది అన్నది ఆరోగ్య నిపుణుల మాట.

వీటిలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శ్వాస వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయని అంటున్నారు.

ఇందులోని విటమిన్‌-సి శరీరంలో పేరుకున్న మలినాలను వదలగొడుతుంది. చర్మానికీ కూడా అనేక విధాలుగా మేలు చేస్తుంది.