పాత బట్టలను వాడటం లేదని ఎవరికైనా ఇస్తున్నారా.. జాగ్రత్త.!

పాత బట్టలను వాడటం లేదని ఎవరికైనా ఇస్తున్నారా.. జాగ్రత్త.!

Samatha J

|

Updated on: Jan 11, 2025 | 7:53 PM

కొత్త బట్టలు కొన్ని రోజులు వేసిన తర్వాత వాటిపైన బోర్‌ కొట్టో.. లేక పాతబడటం వల్లనో తీసి పక్కన పెట్టేస్తాం. ఇక చిన్న పిల్లలకు కొన్న బట్టలైతే.. వారు ఎదుగుతూ ఉంటారు కనుక కొన్ని రోజులకు అవి చిన్నగా అయిపోతాయి. అప్పుడు అవి పిల్లలకు సరిపోవు. ఈ క్రమంలో కొందరు పాత బట్టలను తీసి పడేస్తుంటారు. కొందరు తమ పాత బట్టలను వేరే వ్యక్తులకు ధరించడానికి ఇస్తారు. మరి కొంతమంది పాతబట్టలను ఇంటిని శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు. కొంతమందైతే పాతబట్టలు ఇచ్చి ఇంటికి కావలసిన సామగ్రి కొంటుంటారు.

 పాత బట్టలు పడేయడం, లేదా ఇతరులకు ఇవ్వడం మంచిదేనా? శాస్త్రం ఏం చెబుతుంది..?శాస్త్రం ప్రకారం వాడేసిన లేదా పాత బట్టలు పడేయడం, అమ్మడం లేదా ఇతరులకు ఇవ్వడం మంచిది కాదంటున్నారు. ఇంట్లో పాత బట్టలను భద్రపరచుకోవడానికి స్థలం లేక ఇబ్బంది పడుతుంటే.. శాస్త్రంలో కొన్ని సూచనలు ఉన్నాయి. కొన్ని పద్ధతులను అవలంభించి ఎవరికైనా ఇవ్వచ్చని చెబుతున్నారు. ఎవరికైనా మీ పాత బట్టలు ఇవ్వాలనుకున్నప్పుడు.. ముందుగా వాటిని ఉప్పు నీటిలో నానబెట్టండి. బట్టలను మూడుసార్లు శుభ్రం చేసి ఇస్తే మంచిదంటున్నారు. అలాగే ఉచితంగా బట్టలు ఎవరికీ ఇవ్వకూడదట. బట్టలు ఇచ్చిన తర్వాత వారి నుంచి కనీసం 1 రూపాయి అయినా తీసుకోవాలట. ఇప్పటికీ కొందరికి ఇల్లు శుభ్రం చేయడానికి పాత బట్టలు వాడుతుంటారు. అయితే ఇలాంటి ఆచారం ఇంటికి మంచిది కాదని నిపుణులు సలహా ఇస్తున్నారు. అలాగే బట్టలు ఎవరూ తీసుకెళ్లకపోతే వాటిని చెత్తకుప్పలో పడేయకుండా.. ప్రవహించే నదిలో వదిలేయమని నిపుణులు సూచిస్తున్నారు. కానీ ఇది పర్యావరణానికి మంచిది కాదంటున్నారు పర్యావరణవేత్తలు. ఈ అంశాలన్నీ వ్యక్తిగత నమ్మకానికి సంబంధించినవి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.