PM Modi: ప్రజాసేవ లక్ష్యంగా ఉండాలే తప్ప.. స్వార్ధ ప్రయోజనాల కోసం రాజకీయాలు వద్దుః ప్రధాని మోదీ
ఎన్నికలప్పుడు మాత్రమే తాను రాజకీయాలు మాట్లాడుతానని ప్రధాని మోదీ మరోసారి స్పష్టం చేశారు. ఆ తరువాత తన ఫోకస్ అంతా గుడ్ గవర్నెనెన్స్‌పైనే ఉంటుందన్నారు యువత రాజకీయాల్లో రావడం మంచి పరిణామం అన్నారు. అయితే ప్రజాసేవ లక్ష్యంగా ఉండాలే తప్ప స్వార్ధ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేయోద్దన్నారు ప్రధాని మోదీ. సంకల్పం స్వచ్ఛత వుంటే ఏ విజయాలైనా సాకారం అవుతాయన్నారు.
పొరపాట్లు చేయడం మానవ సహజం. కానీ వాటిని ఒప్పుకోవడానికి కొంతమంది వెనుకా ముందు ఆలోచిస్తుంటారు. పొరపాటును ఒప్పుకోవాలంటే గట్స్ వుండాలి. జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా చూసే విచక్షణ వున్న వాళ్లే వివేకవంతులు. ఇదీ పాడ్‌కాస్ట్ వేదికగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేటెస్ట్ మన్ కీ బాత్. పొరపాట్లు చేయకపోవడానికి తానేం దేవుడిని కాదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌తో తన తొలి పాడ్‌కాస్ట్ సందర్భంగా పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. రెండు గంటలపాటు సాగిన ఈ సంభాషణలో కామత్ రాజకీయాల్లోకి రావడానికి, ఆర్థిక వనరులు అవసరమంపై సుదీర్ఘంగా చర్చించారు. కామత్ అడిగిన ప్రశ్నలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కులంకశంగా సమాధానం ఇచ్చారు.
పాడ్‌క్యాస్ట్‌ల ప్రపంచంలోకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అరంగేట్రం చేశారు. ఆయన ఇటీవల ప్రముఖ పారిశ్రామికవేత్త నిఖిల్ కామత్ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ప్రధాని హాజరైన మొదటి పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ ఇదే కావడం విశేషం. జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ పాడ్‌కాస్ట్ సిరీస్ ‘పీపుల్ బై WTF’లో ఈ ఇంటర్వ్యూ విడుదల అయ్యింది. ఈ సందర్భంగా నిఖిల్ కామత్ తో ప్రధానమంత్రి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా నిఖిత్ కామత్ మాట్లాడుతూ .. ‘నేను ఒక ప్రధానితో కూర్చొని మాట్లాడుతున్నాను. నాకు భయంగా ఉంది’ అనగా.. దీనికి స్పందించిన ప్రధాని మోదీ . ‘ఇదే నా తొలి పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూ. దీన్ని ప్రజలు ఎలా స్వీకరిస్తారో తెలియదు మరి’ అని చిరునవ్వులు కురిపించారు.
ఫస్ట్‌టైమ్ ఫాడ్‌కాస్ట్ ఇంటర్వూ ఇచ్చిన ప్రధాని మోదీ.. వికసిత్ భారత్ లక్ష్యాలు సహా సమకాలీన రాజకీయాలపై దిల్ సే తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. యంగ్ ఎంటర్‌ప్రిన్యూర్, జిరోదా సహా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పీపుల్స్ పేరిట నిర్వహిస్తోన్న పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర అంశాలను చెప్పారు ప్రధాని మోదీ. గుజరాత్ సీఎం టు థర్డ్ టైమ్ పీఎం వరకు తన ప్రస్థానాన్ని పంచుకున్నారు. గతంలో తను చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు.
ఇంటరాక్షన్ సందర్భంగా, “రాజకీయాల్లోకి రావాలంటే తమకు పెద్ద మొత్తంలో డబ్బు అవసరమని, అది తమకు లేదని యువకులు తరచుగా అనుకుంటారు. స్టార్టప్ ప్రపంచంలో, మనకు ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు, స్నేహితులు, కుటుంబ సభ్యుల నుండి నిధులను సేకరిస్తారు. దానిని సీడ్ రౌండ్ అని పిలుస్తాం. రాజకీయాల్లో ఇది ఎలా పని చేస్తుంది?” అని కామత్ అడిగారు. దీనికి సమాధానంగా ప్రధాని తన చిన్ననాటి కథను వివరించారు. “చిన్నతనంలో గ్రామంలో జరిగిన ఒక సంఘటన గుర్తుంది. అక్కడ ఒక వైద్యుడు, నైపుణ్యం కలిగిన కంటి నిపుణుడు, అతను అద్భుతమైన వక్తృత్వ నైపుణ్యం కలిగిన వ్యక్తి. హిందీ, గుజరాతీ రెండింటిలోనూ అనర్గళంగా మాట్లాడగలడు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో, ‘బాల్ సేన’లో భాగంగా చేరానని, జెండాలతో ప్రచారం చేశానని మోదీ అన్నారు.
‘సహనం, అంకితభావం కీలకం’: మోదీ
“గ్రామస్తుల నుండి ఒక రూపాయి విరాళం అడగడం ద్వారా అతను నిధులు సేకరించారు. బహిరంగ సభ సందర్భంగా సేకరించిన మొత్తాన్ని పారదర్శకంగా పంచుకుని ప్రచారానికి రూ.250 మాత్రమే ఖర్చు చేశారు. ఈ నిరాడంబరమైన ఖర్చు ఉన్నప్పటికీ, అతను చాలా తక్కువ తేడాతో గెలిచారు” అని ప్రధాని మోదీ అన్నారు. “సమాజం నిజాయితీకి విలువ ఇవ్వదనేది అపోహ. సహనం, అంకితభావం కీలకం. మీరు ఓట్ల కోసమే చర్యలు తీసుకునే కాంట్రాక్ట్ మైండ్‌సెట్‌ను అవలంబించలేరు. అలాంటి విధానంతో విజయం దక్కదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
కేవలం ప్రజాప్రతినిధులను ఎన్నుకునే సంప్రదాయ రాజకీయ ఆలోచనలకు అతీతంగా ముందుకు సాగాలని ప్రధాని ప్రజలను కోరారు. ఎంపీలు లేదా ఎమ్మెల్యేలను ఎన్నుకోవడానికే పరిమితమైన రాజకీయాలకు అతీతంగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. “ఆడపిల్లలకు చదువు చెప్పడానికి చిన్న ఆశ్రమాన్ని నిర్వహించడం వంటి సామాజిక కార్యక్రమాలలో నిమగ్నమవ్వడం, వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, రాజకీయంగా భారీ ప్రభావాన్ని చూపుతుంది.” అని ప్రధాని అభిప్రాయపడ్డారు. రాజకీయాలను విశాల దృక్పథంతో చూడటం చాలా అవసరం అని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో, ప్రతి ఓటరు తప్పనిసరిగా రాజకీయ నాయకుడు, ఓటు వేసేటప్పుడు వారి తీర్పును ఉపయోగించుకోవాలన్నారు.
ప్రస్తుతం కాలంలో ప్రజలు రాజకీయాల్లోకి రావాలని, ఆశయంతో కాకుండా లక్ష్యంతో రావాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇంటరాక్షన్ సందర్భంగా, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారందరూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి రాలేదని ప్రధాని పేర్కొన్నారు. ఈ ఉద్యమం దేశభక్తితో ప్రేరణ పొందిందని ప్రస్తావిస్తూ, స్వాతంత్ర్యం తర్వాత భారతదేశం యొక్క ఖాదీ అభివృద్ధికి విద్యారంగంలో మరియు మరికొందరు కృషి చేసిన వ్యక్తులు ఉన్నారని ప్రధాని పేర్కొన్నారు. ‘మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలని నేను నమ్ముతాను. వారు ఆశయంతో కాకుండా లక్ష్యంతో రావాలి. మీరు మిషన్‌తో వస్తే, మీకు ఎక్కడో స్థానం లభిస్తుంది. కానీ మిషన్ ఆశయం కంటే ఎక్కువగా ఉండాలి” అని ప్రధాని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చే నాయకులు తమ సుఖదుఃఖాలలో ప్రజలతో పాటు నిలబడాలి. మంచి టీమ్ ప్లేయర్ అయి ఉండాలి. అప్పుడే రాజకీయాల్లో రాణించవచ్చు. ఎన్నికల్లో గెలవవచ్చు, కానీ మీరు విజయవంతమైన రాజకీయ నాయకుడు అవుతారన్న గ్యారెంటీ లేదు.
మహాత్మా గాంధీని ఉదాహరణగా తీసుకుంటూ, “నేటి రాజకీయాల్లో మీరు ఏ నిర్వచనం చూసినా, మహాత్మా గాంధీ ఎక్కడ సరిపోతారు? వ్యక్తిత్వపరంగా అతను చాలా సన్నగా నిర్మించారు. అతను వక్త కాదు. కాబట్టి మీరు ఈ విధంగా చూస్తే, అతను నాయకుడు కాలేదు. అయితే అతన్ని అంత పెద్ద నాయకుడిగా మార్చడానికి కారణం ఏమిటి? అది అతని జీవన విధానం. ఇది ఆయనను దేశానికి నాయకుడిగా నిలబెట్టింది. ప్రతి ఒక్కరినీ నిలబెట్టింది.
తాజా రాజకీయాలపై కామత్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ తాను సోకాల్డ్ పొలిటిషయన్‌ను కాదన్నారు ప్రధాని మోదీ. ఎన్నికలప్పుడు మాత్రమే తాను రాజకీయాలు మాట్లాడుతానన్నారు. ఆ తరువాత తన ఫోకస్ అంతా గుడ్ గవర్నెనెన్స్‌పైనే ఉంటుందన్నారు. దేశమే తన ఫస్ట్ ఛాయిస్ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
People with The Prime Minister Shri Narendra Modi | Ep 6 Trailer@narendramodi pic.twitter.com/Vm3IXKPiDR
— Nikhil Kamath (@nikhilkamathcio) January 9, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..