Vizag: సాధారణ తనిఖీలు.. అనుమానాస్పదంగా భారీ కంటైనర్లు.. తెరిచి చూడగా
అవి సాధారణ తనిఖీలు.. ఎప్పటిలానే పెందుర్తి పోలీసులు ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు. ఈలోగా రెండు కంటైనర్లు వారికి అనుమానాస్పదంగా కనిపించాయి. ఏంటా అని చెక్ చేయగా.. దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఇంతకీ అందులో ఏమున్నాయంటే.? ఆ వివరాలు ఇలా..
పెందుర్తి పోలీసులు అక్రమ పశువుల రవాణాను బట్టబయలు చేశారు. రోజులాగే పెదగాడి జంక్షన్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. కంట్రోల్ రూమ్ ఇచ్చిన పక్కా సమాచారంతో వాహనాలను ముమ్మరంగా చెక్ చేశారు. ఇక అటుగా వచ్చిన రెండు భారీ కంటైనర్లు కొంచెం అనుమానాస్పదంగా కనిపించడంతో.. వాటిని చెక్ చేయగా.. గుట్టుచప్పుడు యవ్వారం కాస్తా బయటపడింది. అక్రమంగా కంటైనర్లలో రాష్ట్ర సరిహద్దులను దాటిస్తున్న పశువులను స్వాధీనం చేసుకుని.. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ కంటైనర్లు మానాపురం నుంచి కర్ణాటకకు తరలిస్తున్నట్లుగా గుర్తించారు. అలాగే ఆ రెండు కంటైనర్లలో 31 ఆవులు, 7 దున్నలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పెందుర్తి పోలీసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Published on: Jan 10, 2025 08:10 PM
వైరల్ వీడియోలు
Latest Videos