Jupally Rameswar Rao: మైహోమ్ అధినేత జూపల్లి రామేశ్వరరావు ఇంట్లో విషాదం.. అన్న శ్రీనివాసరావు కన్నుమూత
మైహోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన అన్నయ్య జూపల్లి శ్రీనివాసరావు స్వర్గస్తులయ్యారు.

మైహోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన అన్నయ్య జూపల్లి శ్రీనివాసరావు స్వర్గస్తులయ్యారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. బుధవారం ఉదయం 6 గంటల 41 నిమిషాలకు ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. శ్రీనివాసరావు మరణంతో సోదరులు జూపల్లి రామేశ్వర రావు, జగపతిరావు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
కుటుంబ సభ్యులు, ఆత్మీయుల కడసారి చూపుల తర్వాత అంతిమయాత్ర మొదలుకానుంది. హైదారబాద్ లోని శ్రీనివాసరావు కుమారుడు వెంకట్రావు నివాసం నుంచి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది.
జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో మధ్యాహ్నం శ్రీనివాసరావు అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. జూపల్లి రామేశ్వరరావు అన్న శ్రీనివాసరావు మరణ వార్త తెలిసి ప్రముఖులంతా సంతాపం తెలిపారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం..
