AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: న్యూ ఇయర్ జోష్‌లో డ్రగ్స్ పెడ్లర్లు.. దిమ్మతిరిగే షాకిచ్చిన రాచకొండ పోలీసులు.. అసలేమైందంటే..?

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా డ్రగ్స్ మాఫియాపై నగర పోలీసు విభాగం ప్రత్యేక దృష్టి పెట్టింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెండు అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలను పట్టుకున్నారు.

Hyderabad: న్యూ ఇయర్ జోష్‌లో డ్రగ్స్ పెడ్లర్లు.. దిమ్మతిరిగే షాకిచ్చిన రాచకొండ పోలీసులు.. అసలేమైందంటే..?
Drugs Case
Shaik Madar Saheb
|

Updated on: Dec 21, 2022 | 8:34 AM

Share

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా డ్రగ్స్ మాఫియాపై నగర పోలీసు విభాగం ప్రత్యేక దృష్టి పెట్టింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెండు అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలను పట్టుకున్నారు. ఒక కేసులో నేరేడ్ మెట్ పోలీసులతో కలసి ఎల్బీనగర్ SOT పోలీసులు ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. నిందితులు శీలం సాయి, నైజీరియాకు చెందిన చిజియోక్ అలియాస్ పీటర్ గా గుర్తించారు. ఒకొరో అనే మరో నైజీరియన్ పరారీలో ఉన్నాడని చెబుతున్నారు రాచకొండ సీపీ. ఇద్దరు నిందితుల నుంచి ఆరు లక్షల రూపాయల విలువ చేసే ముప్పై గ్రాముల మెటాఫెటామైన్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు 1500 నగదు, 2 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడైన పీటర్ 2014లో ఇండియాకు స్టూడెంట్ వీసాపై వచ్చాడు. వీసా గడువు ముగిసినప్పటికీ ఇక్కడే ఉంటూ.. డ్రగ్స్ పెడ్లర్ గా మారాడు. పీటర్ కి గతంలో నేర చరిత్ర ఉందని గుర్తించారు పోలీసులు. ఇతడు ఏడాది పాటు జైలుకు వెళ్లి వచ్చాడని చెబుతున్నారు. మణికొండకు చెందిన సాయి కృష్ణ డ్రగ్ ఎడిక్ట్ గా మారాడనీ. తర్వాతి కాలంలో ఇతను కూడా డ్రగ్స్ సప్లై చెయిన్ లో భాగస్వామి అయ్యాడనీ. పీటర్ ముంబై నుంచి డ్రగ్స్ తెస్తే.. సాయి కృష్ణ నగరంలో రిసీవ్ చేసుకునేవాడనీ చెబుతున్నారు పోలీసులు. వీరి కదలికలపై నిఘా వేసిన పోలీసులు.. పక్కా సమాచారంతో.. పట్టుకున్నారు. వీరిని అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు.

మరో కేసులో రాజస్థాన్ నుంచి నగరానికి ఉపాధి కోసం వచ్చిన మరో ఐదుగురు డ్రగ్ పెడ్లర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరు కూడా సిటీలో డ్రగ్ దందా చేస్తున్నట్టు గుర్తించిన ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు నిఘా పెట్టి అరెస్టు చేశారు. తర్వాత వీరిని మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. రాజస్థాన్ కు చెందిన ఈ ఐదుగురి నుంచి 35 లక్షలు విలువ చేసే 45 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.. ఈ కేసులో రాజస్థాన్ కు చెందిన ప్రవీణ్ కుమార్ ను ప్రధాన నిందితుడిగా గుర్తిచారు. వీరిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు. NDPS యాక్ట్ మోస్ట్ పవర్ఫుల్. ఈ యాక్ట్ కింద ఒకటికన్నా ఎక్కువ సార్లు నేరాలకు పాల్పడితే.. ఉరిశిక్ష పడే ఛాన్సు కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. స్టూడెంట్ వీసాపై వస్తోన్న నైజీరియన్లు.. తమ వీసా గడువు ముగియగానే.. సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ సప్లై, సెక్స్ రాకెట్లను నడుపుతున్నట్టు తమ సర్వేలో తేలిందని అంటున్నారు పోలీసులు. వీసా ముగియగానే వారిని స్వదేశాలకు పంపుతామని. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ వారిపై పీడీయాక్ట్ ప్రయోగించి.. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా త్వరిత గతిన శిక్ష పడేలా చూస్తామంటున్నారు రాచకొండ పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..