Gateway IT Park: తెలంగాణకు మరో మణిహారం.. కండ్లకోయ ఐటీ పార్క్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న‌..

తెలంగాణ గేట్ వే పేరుతో హైదరాబాద్‌(Hyderabad) శివార్లలోని కండ్లకోయలో (Kandlakoya) ఐటీ పార్కుకు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) గురువారం ఉద‌యం శంకుస్థాపన చేశారు.

Gateway IT Park: తెలంగాణకు మరో మణిహారం.. కండ్లకోయ ఐటీ పార్క్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న‌..
New It Park At Kandlakoya
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 17, 2022 | 1:46 PM

తెలంగాణ గేట్ వే పేరుతో హైదరాబాద్‌(Hyderabad) శివార్లలోని కండ్లకోయలో (Kandlakoya) ఐటీ పార్కుకు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) గురువారం ఉద‌యం శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) పుట్టినరోజు సందర్భంగా పార్కు పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మ‌ల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద‌, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజుతో పాటు ప‌లువురు టీఆర్ఎస్(TRS) నాయ‌కులు పాల్గొన్నారు. దీంతో విశ్వనగరంగా విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరంలో ఐటీ రంగం రూపు దిద్దుకుంది. హైదరాబాద్‌ పడమరలో అభివృద్ధి చెందిన ఐటీ పరిశ్రమ ఉత్తరానికి విస్తరిస్తుంది. రాష్ట్రంలో అత్యంత ఎత్తైన భారీ ఐటీ పార్కును మేడ్చల్‌ జిల్లా కండ్లకోయలో ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. తెలంగణ గేట్‌ వే పేరిట 10 ఎకరాల్లో రూ.వంద కోట్లతో నిర్మించనున్నారు. దాదాపు వంద సంస్థలకు కేటాయించనున్నారు.

ఈ పార్కు ద్వారా 50వేల మందికిపైగా ఉద్యోగాలు లభించనున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌కు నలువైపులా ఐటీ అభివృద్ధిలో భాగంగా ఐటీ రంగం వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే అవుటర్‌ రింగ్‌రోడ్డు ప్రాంతంలో మరో భారీ ఐటీ టవర్ చేపడుతున్నారు. అత్యంత ఎత్తైన కొత్త ఐటీ పార్కు ఏర్పాటు కోసం గత కొన్నేళ్లుగా స్థలాలను అన్వేషిస్తున్న ప్రభుత్వం కండ్లకోయ వైపు మొగ్గు చూసింది.

కండ్లకోయ- మేడ్చల్‌ జంక్షన్‌లో 10 ఎకరాల్లో ఐటీ పార్కు ఏర్పాటు అవుతుందని, ఈ స్థలాన్ని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కేటాయించింది. విమానాశ్రయానికి 45 నిమిషాల్లో చేరుకునే సౌకర్యంతో పాటు రహదారుల అనుసంధానం వంటి వాటిని సానుకూలంగా భావించింది. కండ్లకోయ జంక్షన్‌ వద్ద స్థల ఎంపిక పూర్తికావడంతో నిర్మాణ ప్రణాళికను సర్కారు సిద్ధం చేసింది. బాధ్యతలను టీఎస్‌ఐఐసీకి అప్పగించింది. ఇప్పటికే 70కి పైగా సంస్థలు కార్యాలయ స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఈ పార్కులో సమావేశ మందిరాలు, భారీ పార్కింగు తదితర సౌకర్యాలు కల్పించనున్నారు.

ఇవి కూడా చదవండి: Medaram Jathara 2022: మహా జన జాతరలో సందడిగా తొలి ఘట్టం.. ఇవాళ సమ్మక్క ఆగమనం

CM KCR Birthday: 68వ వసంతంలోకి సీఎం కేసీఆర్.. రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జన్మదిన వేడుకలు..