AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. ప్రియుడితో కలిసి భార్య ఏం చేసిందంటే..??

సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. క్షణికావేశంలో చేస్తున్న పనులు నిండు జీవితాన్ని కూల్చుతున్నాయి. తమ వివాహేతర సంబంధానికి అడ్డు పడుతున్నాడన్న..

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. ప్రియుడితో కలిసి భార్య ఏం చేసిందంటే..??
Warangal Crime News
Ganesh Mudavath
|

Updated on: Feb 17, 2022 | 3:51 PM

Share

సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. క్షణికావేశంలో చేస్తున్న పనులు నిండు జీవితాన్ని కూల్చుతున్నాయి. తమ వివాహేతర సంబంధానికి అడ్డు పడుతున్నాడన్న కారణంతో.. ఓ మహిళ తన భర్తను ప్రియుడితో అత్యంత దారుణంగా హత్య(Murder) చేయించింది. అనంతరం ఏమీ తెలియనట్లు పోలీస్‌ స్టేషన్‌లో తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. భార్య వ్యవహారం అనుమానంగా ఉండటంతో ఆ వైపు నుంచి దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో భార్యే తన భర్తను మరో ఇద్దరితో హత్య చేయించినట్లు తేలింది. అమీన్‌పూర్‌ చక్రపురి కాలనీలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అతని చేతిపై ఉన్న పచ్చబొట్టు, అదే సమయంలో చందానగర్‌ ఠాణాలో తన భర్త కనిపించడం లేదంటూ మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా అతడిని వెంకటప్పగా గుర్తించారు. వెంకటప్పను హత్య చేసిన ముగ్గురిని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు.

తెలంగాణలోని వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం జీవన్గీకి చెందిన వెంకటప్ప.. చందానగర్‌ శివారు గంగారంలో భార్య పద్మ, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. వెంకటప్ప కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంటి పక్కన నివాసముండే అబ్దుల్ రెహమాన్ తో పద్మకు పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. భార్యతో రహమాన్‌ ఏకాంతంగా ఉన్న సమయంలో వెంకటప్ప చూసి భార్యతో గొడవ పడ్డాడు. తమ బంధానికి భర్త అడ్డు పడుతున్నాడని అతడిని హత్య చేయించేందుకు రహమాన్‌తో కలిసి పద్మ పన్నాగం పన్నింది.

తనతో సెంట్రింగ్‌ పనిచేసే సుభాష్‌తో కలిసి ఈనెల 8న చందానగర్‌ అడ్డా వద్ద ఉన్న వెంకటప్ప వద్దకు రహమాన్ వెళ్లి కూలీ పని ఉందని చెప్పాడు. ముగ్గురు కలిసి ద్విచక్రవాహనంపై కొల్లూరు వెళ్లారు. అక్కడ పని లేదని ఆలూర్‌ వెళ్లి వెంకటప్ప, సుభాష్‌ మద్యం తాగారు. అక్కడి నుంచి అమీన్‌పూర్‌ చక్రపురికాలనీలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. మద్యం మత్తులో బండరాయితో వెంకటప్ప తల, ముఖంపై కొట్టి హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ పుటేజీ, పద్మ కాల్‌డేటా అధారంగా దర్యాప్తు చేపట్టారు. హత్య చేసిన ముగ్గురినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read

Hijab in AP: ఏపీని తాకిన హిజాబ్ వివాదం.. విద్యార్థినులను అనుమతించని కళాశాల యాజమాన్యం

Bheemla Nayak: పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ఆ రోజే భీమ్లా నాయక్‌ గ్రాండ్‌ ప్రిరిలీజ్‌ ఈవెంట్‌.?

Bombay High Court: రెండో భార్యకు ఆ హక్కులు ఉండవు.. సంచలన కామెంట్స్ చేసిన హైకోర్టు..