AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bheemla Nayak: పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ఆ రోజే భీమ్లా నాయక్‌ గ్రాండ్‌ ప్రిరిలీజ్‌ ఈవెంట్‌.?

Bheemla Nayak: పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'భీమ్లా నాయక్‌'. వకీల్‌సాబ్‌ వంటి సూపర్ హిట్‌ సినిమా తర్వాత పవన్ నటిస్తోన్న సినిమా కావడంతో భీమ్లా నాయక్‌ చిత్రంపై సహజంగానే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకు...

Bheemla Nayak: పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ఆ రోజే భీమ్లా నాయక్‌ గ్రాండ్‌ ప్రిరిలీజ్‌ ఈవెంట్‌.?
Bheemla Nayak
Narender Vaitla
|

Updated on: Feb 17, 2022 | 2:49 PM

Share

Bheemla Nayak: పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘భీమ్లా నాయక్‌’. వకీల్‌సాబ్‌ వంటి సూపర్ హిట్‌ సినిమా తర్వాత పవన్ నటిస్తోన్న సినిమా కావడంతో భీమ్లా నాయక్‌ చిత్రంపై సహజంగానే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్లుగానే చిత్ర యూనిట్ అత్యంత భారీగా తెరకెక్చింది. అందులోనూ పవన్‌కు ఆత్మీయుడైన త్రివిక్రమ్‌ మాటలు, స్క్రీన్‌ప్లేతో ఓ పాట కూడా రాయడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

త్రివిక్రమ్‌ మార్క్‌ డైలాగ్‌లను మరోసారి పవన్ నుంచి వినాలని ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. సాగర్‌ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మయాళ సూపర్ చిత్రం అయ్యప్పన్ కోషియమ్‌కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. రానా, పవన్‌లు తొలిసా స్క్రీన్‌ను షేర్‌ చేసుకోవడం కూడా ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి మరో కారణంగా చెప్పవచ్చు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాను ఫిబ్రవరి 25న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పవన్‌ ఫ్యాన్స్‌ సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఇక భీమ్లా నాయక్‌ చిత్ర షూటింగ్‌ను గురువారం చిత్ర యూనిట్‌ పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో సినిమా తేదీ దగ్గరపడుతుండడంతో అభిమానులు ప్రిరిలీజ్‌ ఈవెంట్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఫిబ్రవరి 21న భీమ్లా నాయక్‌ ప్రిరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించనున్నారని సమాచారం.

మొన్నటి వరకు కరోనా ఆంక్షలు ఉండడంతో చాలా వరకు ఇతర సినిమాల ఈవెంట్స్‌ ఇండోర్‌లో నిర్వహించగా.. ప్రస్తుతం ఆంక్షలు దాదాపు ఎత్తివేయడంతో భీమ్లా నాయక్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను యూసుఫ్‌ గూడలోని పోలీస్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయమై ఓ క్లారిటీ రానుంది. మరి కరోనా థార్డ్‌ వేవ్‌ తర్వాత రాబోతున్న ఈ పెద్ద సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి ఊపునిస్తుందో చూడాలి.

Also Read: NEET UG Counselling 2021: నీట్‌ 2 దశ కౌన్సెలింగ్‌ ప్రారంభం.. షెడ్యూల్‌ ఇదే..

Viral Video: వరుడికి దిమ్మతిరిగే షాకిచ్చిన పెళ్లి కూతురు.. దెబ్బకు అబ్బాయి సెట్టయ్యాడుగా..

Viral Photo: తగ్గేదేలే.! ఈ ఫోటోలో పాము దాగుంది.. కనిపెడితే కిక్కే.. కిక్కు.. చాలామంది ఫెయిల్ అయ్యారు!