Viral Photo: తగ్గేదేలే.! ఈ ఫోటోలో పాము దాగుంది.. కనిపెడితే కిక్కే.. కిక్కు.. చాలామంది ఫెయిల్ అయ్యారు!

ఎంటర్టైన్మెంట్ కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. క్రియేటర్లు తమ మెదడుకు పదును పెట్టి క్రియేటివ్ స్టైల్‌లో కామెడీని జెనరేట్ చేస్తున్నారు. మీమ్స్...

Viral Photo: తగ్గేదేలే.! ఈ ఫోటోలో పాము దాగుంది.. కనిపెడితే కిక్కే.. కిక్కు.. చాలామంది ఫెయిల్ అయ్యారు!
Find The Snake
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 17, 2022 | 11:24 AM

ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోవడంతో.. ప్రస్తుతం అన్నీ అరచేతిలోకి వచ్చేశాయి. ఎక్కడ చీమ చిటుక్కుమన్నా.. సోషల్ మీడియా ద్వారా మనకు క్షణాల్లో తెలిసిపోతోంది. అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. క్రియేటర్లు తమ మెదడుకు పదును పెట్టి క్రియేటివ్ స్టైల్‌లో కామెడీని జెనరేట్ చేస్తున్నారు. మీమ్స్, కామెడీ కొటేషన్స్, ఫన్నీ ట్రోలింగ్ వీడియోస్.. ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. ఇక ఈ కోవలోనే ఫోటో పజిల్స్(Photo Puzzles) కూడా సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌గా నిలుస్తున్నాయి. సహజంగా మనం ఏదైనా పజిల్‌ను సాల్వ్ చేయాలనుకుంటే.. అందులో ఏముందో కనిపెట్టే దాకా.. తగ్గేదేలే అన్నట్లు దాన్ని వదిలిపెట్టం. అలాంటిదే పద సంపత్తి కూడా.. సరైన పదాలను బాక్సులలో పూరించే దాకా నిద్రపోం.

అయితే ఇవి రెండూ ఒక ఎత్తయితే.. ఫోటో పజిల్స్ వేరే ఎత్తు. మీ కళ్లకు పదునుంటే.. వీటిని క్షణాల్లో సాల్వ్ చేసేయగలం. కొన్నిసార్లు సోషల్ మీడియాలో పాత ఫోటో పజిల్స్ కూడా వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ ఫోటో పజిల్‌ను సాల్వ్ చేయడంలో నెటిజన్లు తల పట్టుకున్నారు. పైన పేర్కొన్న ఫోటోలో ఓ పాము దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. ఫోటోగ్రాఫర్ చాకచక్యంగా ఈ ఫోటోను తీశాడు. ఈ ఫోటో పజిల్‌ నెటిజన్లకు ఓ సవాల్‌ను విసురుతుండగా.. ఆ పాము ఎక్కడుందో కనిపెట్టేందుకు వ్యూయర్స్ తమ కళ్లకు పని చెప్పారు. కొంతమంది ఈ పజిల్‌ను క్షణాల్లో సాల్వ్ చేయగా.. మరికొంతమంది మాత్రం ఫెయిల్ అయ్యారు. ఇంకొందరైతే అందులో పాము లేదు.! ఏమి లేదని.? కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరేమంటారు.? ఓసారి ట్రై చేయండి. పాము దొరికితే కామెంట్ పెట్టండి.. లేదంటే సమాధానం కోసం క్రింద ఫోటోను చూడండి..