NEET UG Counselling 2021: నీట్ 2 దశ కౌన్సెలింగ్ ప్రారంభం.. షెడ్యూల్ ఇదే..
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (NEET UG 2021) రౌండ్ 2 కౌన్సెలింగ్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 16 (బుధవారం)న ప్రారంభమైంది..
NEET UG Counselling 2021 dates: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (NEET UG 2021) రౌండ్ 2 కౌన్సెలింగ్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 16 (బుధవారం)న ప్రారంభమైంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ఫిబ్రవరి 21న (మధ్యాహ్నం 12 గంటలలోపు, దరఖాస్తు రుసుమును మధ్యాహ్నం 3 గంటలలోపు చెల్లించవల్సి ఉంటుంది) ముగుస్తాయి. విద్యార్ధులు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) అధికారిక వెబ్‌సైట్mcc.nic.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నిజానికి, నీట్ 2021 రౌండ్ 2 కౌన్సెలింగ్ ఫిబ్రవరి 9న ప్రారంభం కావాల్సి ఉండగా.. వారంపాటు వాయిదా పడింది. దీంతో మొత్తం 4 రౌండ్లలో జరగవల్సిన నీట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ తేదీలలో మార్పులు చోటుచేసుకున్నాయి. కాగా మొదటి దశ కౌన్సెలింగ్ జనవరి 19 నుంచి 24 వరకు జరగనుండగా… ఎమ్‌సీసీ ఈ ప్రక్రియను జనవరి 28 నుంచి 30 వరకు జరిగాయి. నీట్ రౌండ్ 2 కౌన్సెలింగ్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగిన విద్యార్ధులు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. రౌండ్ 2 కౌన్సెలింగ్ రిజల్ట్స్ ఫిబ్రవరి 26న విడుదలకానున్నాయి.
ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఆర్డర్‌ను భారత సుప్రీంకోర్టు సమర్థించిన వారం (జనవరి 7వ) తర్వాత జనవరి 13న నీట్ యూజీ కౌన్సెలింగ్ 2021 తేదీలను ఎమ్‌సీసీ ప్రకటించింది. మొత్తం నాలుగు దశల కౌన్సెలింగ్ (రౌండ్ 1, రౌండ్ 2, మాప్-అప్ రౌండ్, ఆన్‌లైన్ స్ట్రే వేకెన్సీ రౌండ్)లలో విద్యార్ధులు మొదటి మూడు రౌండ్‌ల వరకు మాత్రమే కౌన్సెలింగ్ నమోదుకు అనుమతి ఉంటుంది. చివరి రౌండ్‌లో నమోదు చేసుకోవడానికి అనుమతి ఉండదు. మొదటి అలాట్‌మెంట్ రౌండ్‌లో సీటు రాని విద్యార్ధులు, మొదటి రౌండ్‌లో కేటాయించిన సీటును రద్దు చేసుకున్నవారు, సీటు వచ్చినా దానిని రిజెక్ట్ చేసిన విద్యార్ధులు రెండో దశ కౌన్సెలింగ్‌కు అర్హత ఉంటుంది. ఇక మాప్ అప్ రౌండ్ కౌన్సెలింగ్ మార్చి 10 నుంచి 14 వరకు జరుగుతుంది. చివరి దశ కౌన్సెలింగ్ మార్చి 11 నుంచి 14 వరకు జరుగుతుంది.
Also Read: