Andhra Pradesh: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో 1000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు..

ఇప్పటికే 4 ఒప్పందాలు కుదుర్చుకున్న ఏపీఈడీబీ మరో కీలక నిర్ణయం తీసుకుంది..

Andhra Pradesh: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో 1000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు..
Dubai Expo
Follow us

|

Updated on: Feb 17, 2022 | 12:41 PM

1000 Direct Employment Opportunities To AP Unemployed people: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దుబయ్ ఎక్స్ పో పర్యటన బిజీగా సాగుతోంది. వరుస సమావేశాలు, కీలక ఒప్పందాలతో మంత్రి మేకపాటి నేతృత్వంలోని బృందం ముందుకువెళ్తోంది. ఇప్పటికే 4 ఒప్పందాలు కుదుర్చుకున్న ఏపీఈడీబీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అల్యూమినియం కాయిల్, పానెళ్ళ తయారీ యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు దిశగా అలుబండ్ గ్లోబల్ లిమిటెడ్ పరిశ్రమతో ఎంవోయూ ప్రక్రియ పూర్తి చేసింది. ప్రభుత్వ సలహాదారు జుల్ఫీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమక్షంలో గురువారం (ఫిబ్రవరి 17) ఏపీఈడీబీ సీఈవో జవ్వాది సుబ్రమణ్యం, అలుబండ్ గ్లోబల్ ఛైర్మన్ షాజి ఎల్ ముల్క్ ఇరువురు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ నాలుగు కంపెనీల ద్వారా 1000 కొత్త ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు ఏపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందంలో భాగంగా అలుబండ్ గ్లోబల్ పరిశ్రమకు అవసరమైన 150 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించనుంది. ఈ ఒక్క కంపెనీ ద్వారానే 200 ఉద్యోగాలు లభించనున్నాయి.

గ్రూప్ సమావేశాలతో బిజీగా మంత్రి పర్యటన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అబుదాబీలోని అబుదాబీ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ అథారిటీ, జీ43, ముబదల గ్రూఫులతో వరుసగా సమావేశమయ్యారు. అబుదాబిలోని “జీ42” ప్రతినిధులతో మంత్రి మేకపాటి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మౌలిక వసతులకు సంబంధించిన ఫండింగ్ పై ప్రధానంగా చర్చించారు. జీ42 ప్రతినిధులను ఏపీలో పెట్టుబడులకు ముందుకు రావాలని, అక్కడి వసతులను పరిశీలించాలని మంత్రి ఆహ్వానం పలికారు. పరిపాలన, నైపుణ్య మానవవనరులు, మౌలిక సదుపాయాల కల్పనలో అన్ని విధాల ఏపీ ప్రభుత్వం తరపున అండగా ఉంటామన్నారు. అనంతరం జీ42 కంపెనీ గురించి ఆ సంస్థ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ రఫేలే బ్రెస్చి మంత్రికి వివరించి చెప్పారు. ఐటీ నైపుణ్యం కలిగిన యువతకు భారత్, ఏపీలో కొదవలేదన్నారు. ఎనర్జీ, స్మార్ట్ సిటీ, హెల్త్ కేర్, నైపుణ్యం, విద్య, డిజిటల్ గవర్నమెంట్ అండ్ ఎంటర్ ప్రైజెస్, ఐటీ, టెక్నాలజీ తదితర రంగాలలో పెట్టుబడులకు అందుబాటులో ఉన్న అవకాశాలపై చర్చించారు.

ముబదల గ్రూప్ పెట్టుబడుల కంపెనీ సీఈవోలతో సమావేశం అబుదాబీలోని అల్ మరోరాలో ఉన్న ముబదల కార్యాలయంలో మంత్రి మేకపాటి సంబంధిత గ్రూప్ కంపెనీ సీఈవోలతో భేటీ అయ్యారు. సమావేశానికి అబుదాబిలోని భారత రాయబారి సంజయ్ సుధీర్‌తో కలిసి హాజరయ్యారు. పారిశ్రామిక వసతులు, రెన్యువబుల్ ఎనర్జీ, విశాఖ మెట్రో ప్రాజెక్టు, పోర్టులలో పెట్టుబడులకు గల అవకాశాలపై మంత్రి ముబాదల సీఈవోలు ప్రధానంగా చర్చించారు.

అబుదాబీ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ అథారిటీతో మంత్రి సమావేశం మంత్రి మేకపాటి అబుదాబీ పారిశ్రామికాభివృద్ధి సంస్థతో కూడా మంత్రి సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు, వాణిజ్యానికి గల అవకాశాలను మంత్రి మేకపాటి అడియా సంస్థకు వివరించారు. భవిష్యత్తులో ఏపీతో పెట్టుబడుల భాగస్వామ్యానికి ఏపీఈడీబీతో కలిసి ముందుకు వెళతామన్నారు. ఉష్ణోగ్రత తగ్గించి చల్లబరిచే అధునాతన టెక్నాలజీ దిశగా తబ్రీద్ కంపెనీతో ఏపీ ఎంవోయూ కుదుర్చుకోవడంపై అడియా సంస్థ సంతోషం వ్యక్తం చేసింది. దాదాపు రూ.1500 కోట్ల పెట్టుబడుల దిశగా అలుబండ్ గ్లోబల్ లిమిటెడ్ పరిశ్రమతో మరో కీలక ఎంవోయూ కుదుర్చుకున్నారు.

Also Read:

KCR Birthday in Australia: ఆస్ట్రేలియాలో ఘనంగా సీఎం కేసీఆర్‌కు జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో విషెస్ చెప్పిన అభిమాని..

Gautam Sawang: ఏపీపీఎస్సీ కొత్త ఛైర్మన్‌గా గౌతమ్‌ సవాంగ్‌..!

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి