Gautam Sawang: ఏపీపీఎస్సీ కొత్త ఛైర్మన్‌గా గౌతమ్‌ సవాంగ్‌..!

ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా గౌతామ్‌ సవాంగ్‌ (Gautam Sawang )ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం (ఫిబ్రవరి 17) ఉత్తర్వులు జారీ చేసింది..

Gautam Sawang: ఏపీపీఎస్సీ కొత్త ఛైర్మన్‌గా గౌతమ్‌ సవాంగ్‌..!
Gautam Sawang Appsc
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 17, 2022 | 12:19 PM

DGP Gautam Sawang News: ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా గౌతామ్‌ సవాంగ్‌ (Gautam Sawang)ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం (ఫిబ్రవరి 17) ఉత్తర్వులు జారీ చేసింది. కాగా రెండు రోజుల క్రితమే డీజీపీ పదవి నుంచి గౌతమ్‌ సవాంగ్‌ను తప్పించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనను ఏపీపీఎస్సీ చైర్మన్‌ (APPSC Chairman)గా నియమించింది. పలు కారణాలతో సవాంగ్‌పై బదిలీవేటు వేసిన ప్రభుత్వం… ఆయనకు ఏపీపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు కట్టబెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

గౌతామ్‌ సవాంగ్‌ ఉద్యోగ ప్రస్థానం ఇలా.. 1986 బ్యాచ్‌కు చెందిన సవాంగ్‌… చిత్తూరు జిల్లా మదనపల్లె ఏఎస్పీగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. చిత్తూరు, వరంగల్‌ జిల్లాలకు ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సవాంగ్…2001 నుంచి 2003 వరకు వరంగల్‌ రేంజి డీఐజీగానూ పనిచేశారు. 2003 నుంచి 2004 వరకు స్పెషల్‌ బ్రాంచ్‌ డీఐజీగా, 2004 – 2005 వరకు APSP డీఐజీగా బాధ్యతలు నిర్వహించారు. 2005 నుంచి 2008 వరకు సీఆర్‌పీఎఫ్‌ డీఐజీగా పనిచేసిన సవాంగ్‌.. 2008 నుంచి 2009 వరకు శాంతిభద్రతల విభాగం ఐజీగా పనిచేశారు. 2016-2018 వరకూ విజయవాడ సీపీగా… 2018 జులైలో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2019 ఆగస్ట్‌ 3న ఏపీ డీజీపీగా సవాంగ్‌ బాద్యతలు చేపట్టారు.

ఐతే 2023 జులై వరకూ పదవీకాలం ఉన్నప్పటికీ.. ఆయనపై హఠాత్తుగా బదిలీ వేటు పడింది. జనరల్ అడ్మినస్ట్రేషన్‌కు రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం నుంచి మంగళవారం ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే, కేవలం రెండ్రోజుల వ్యవధిలో సవాంగ్‌ను కీలకమైన ఏపీపీఎస్సీ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అంతటా చర్చ కొనసాగుతోంది.

Also Read:

BEL Recruitment 2022: ఎమ్మెస్సీ అర్హతతో భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఎంపిక ప్రక్రియ ఇలా..