AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR Birthday: ఏపీలో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు.. కడియం రైతుల వినూత్న శుభాకాంక్షలు..

తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణలో కాదు.. ఆంధ్రప్రదేశ్‌లో కూడా..

CM KCR Birthday: ఏపీలో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు.. కడియం రైతుల వినూత్న శుభాకాంక్షలు..
Cm Kcr
Sanjay Kasula
| Edited By: Ravi Kiran|

Updated on: Feb 17, 2022 | 11:12 AM

Share

తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్ శ్రేణులు రక్తదాన శిబిరాలు, అన్నదానాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే తెలంగాణలోనే కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోనూ సీఎం కేసీఆర్‌కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీల్లో సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు వినూత్నంగా నిర్వహించారు. మొక్కలు, కూరగాయలు, పువ్వులతో సీఎం కేసీఆర్ అద్భుత చిత్రాన్ని ఆవిష్కరించారు. తద్వారా ఏపీ ప్రజలు కూడా వెన్నంటే ఉన్నారని సందేశం అందించారు. కడియపులంక గ్రీన్ లైఫ్ నర్సరీలో కేసీఆర్ కు ఘనంగా బర్త్ డే విషెస్ తెలిపిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

నభూతో నభవిష్యతి అన్నట్టు రాష్ట్రంలో హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సీఎం కేసీఆర్. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కలిసికట్టుగా ఒక్కరోజే నాటిన మొక్కల సంఖ్య కోటి దాటింది. రాష్ట్ర సాధన మొదలు.. ఏ కార్యక్రమం చేపట్టినా.. ఏ పథకం రూపుదిద్దినా.. ఉద్యమరూపంలోనే.. ఉధృతరూపంలోనే నడిపే ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో కదిలొచ్చిన ప్రజల స్ఫూర్తికి పుడమితల్లి పులకించిపోయింది.. తెలంగాణ కోటి మొక్కల కార్యక్రమం కోసం కడియం నర్సరీల నుంచి మొక్కల తీసుకొచ్చారు. అయితే ఆ సంగతిని గుర్తుంచుకున్న కడియం రైతులు సీ.ఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు కడియం రైతులు.

ఇవి కూడా చదవండి: Medaram Jathara 2022: మహా జన జాతరలో సందడిగా తొలి ఘట్టం.. ఇవాళ సమ్మక్క ఆగమనం

CM KCR Birthday: 68వ వసంతంలోకి సీఎం కేసీఆర్.. రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జన్మదిన వేడుకలు..