AP Gold Loans: గోల్డ్ లోన్ తీసుకునే రాష్ట్రాలో టాప్‌లో ఏపీ.. షాకింగ్ విషయాలు మీకోసం..

AP Gold Loans: పైసా పైసా కూడబెట్టుకుని.. రకరకాల డిజైన్లతో నగలు కొంటారు. మరి అంత ఆశతో కొన్న బంగారాన్ని ఎందుకు కుదువ

AP Gold Loans: గోల్డ్ లోన్ తీసుకునే రాష్ట్రాలో టాప్‌లో ఏపీ.. షాకింగ్ విషయాలు మీకోసం..
Gold Loan Low Interest
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 17, 2022 | 9:58 AM

AP Gold Loans: పైసా పైసా కూడబెట్టుకుని.. రకరకాల డిజైన్లతో నగలు కొంటారు. మరి అంత ఆశతో కొన్న బంగారాన్ని ఎందుకు కుదువ పెడుతున్నారు? బతుకు బండి దొల్లడం లేదా? ఖర్చులు ఎక్కువైపోయాయా? లేదంటే ఉపాధి, ఆదాయ మార్గాలు తగ్గాయా? కరోనా అటాక్ చేసిన ఈ రెండేళ్లలోనే గోల్డ్ బాక్స్‌లతో ఎందుకు బ్యాంకులు, ప్రైవేట్ కంపెనీల చుట్టూ తిరుగుతున్నారు? ప్రస్తుత పరిణామాలపై ఆర్ధిక నిపుణులు ఏమంటున్నారో ఓ సారి చూడండి.

ప్రపంచంలోనే మన దేశ మహిళలకు బంగారంపై మక్కువ ఎక్కువ. దేశంలో కనీసం గ్రాము బంగారమైనా ఉండని ఇళ్లు ఉండదు. దేశంలో బంగారం రేట్లు అమాంతం పెరుగుతూనే ఉన్నా.. అమ్మకాల్లో జోష్ మాత్రం తగ్గదు. ఇండియాలో 2020తో పోల్చుకుంటే 2021లో గోల్డ్‌కు 78.6శాతం డిమాండ్ పెరిగింది. 2020లో 446 టన్నుల బంగారం కొంటే.. 2021లో 797.3 టన్నుల గోల్డ్ అమ్ముడుపోయింది. మరోవైపు అమ్మకాలు ఏ రేంజ్‌లో అయితే పెరిగాయో.. తాకట్టు లిస్టు కూడా అదే రేంజ్‌లో పెరిగింది. ఇండియాలో రూ. 6 లక్షల కోట్ల బంగారు లోన్లు ఉన్నాయి. వాటిల్లో 75 శాతం.. అంటే రూ. 4 లక్షల కోట్ల లోన్లు ఫైనాన్స్ కంపెనీలు ఇచ్చాయి. బ్యాంకులు, నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో మరో రూ. 2 లక్షల కోట్ల బంగారు రుణాలు లిస్టింగ్ అయ్యాయి. 2021 -22 ఫైనాన్సియల్ ఇయర్ ముగిసేలోపు.. రూ. 8 లక్షల కోట్లకు పసిడి తాకట్టు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2021 మార్చి 31 నాటికి ఒక్క ఎస్బీఐలోనే 26 లక్షల మంది గోల్డ్ లోన్ కస్టమర్లు ఉన్నారు. స్టేట్ బ్యాంకులో ఒక్క ఏడాదిలోనే గోల్డ్ లోన్స్ భారీగా పెరిగాయి. 2020 లో రూ. 27,223 కోట్లు ఉంటే.. జులై 2021 నాటికి రూ. 62,412 కోట్ల గోల్డ్ రుణాలు ఇచ్చారు. అంటే ఒక్క ఏడాదిలోనే 338 శాతం గోల్డ్ లోన్స్ హైక్ అయ్యాయి. జనవరి 2020 నాటికి కమర్షియల్ బ్యాంకుల్లో గోల్డ్ లోన్ సైజు రూ. 29,355 కోట్లుంటే.. రెండేళ్లలోనే రెండున్నర రెట్లు పెరిగి రూ.70,871 కోట్లకు చేరుకున్నాయి. దేశంలో ఓ అతిపెద్ద గోల్డ్ లోన్ ఫైనాన్స్ కంపెనీలో రూ. 39,096 కోట్ల నుంచి రూ. 61,696 కోట్లకు గోల్డ్ లోన్స్ లిస్ట్ అయినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కలు చెప్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే.. పర్సనల్ లోన్స్, ప్రాపర్టీ లోన్స్, వెహికల్ లోన్స్ తీసుకునే వాళ్లు ఏమయ్యారో గానీ.. గోల్డ్ లోన్స్ కోసం మాత్రం పబ్లిక్ క్యూ కడుతున్నారు.

ఏపీలో ఈ లెక్క కాస్త ఎక్కువగానే ఉంది. దేశంలో గోల్డ్ లోన్లు తీసుకున్న వాళ్లలో కేరళ టాప్‌‌లో ఉంటే.. ఏపీ థర్డ్ ప్లేస్‌లో ఉంది. ఇక తెలంగాణ 9వ స్థానంలో ఉంది. దేశంలో మొత్తం బంగారం తాకట్టులో ఒక్క ఏపీ నుంచి 10శాతం తనఖా పెట్టారు. అదే తెలంగాణలో చూసుకుంటే.. 3 శాతం. ఇక తెలంగాణ మొత్తం ఆస్తుల్లో 17 శాతం గోల్డ్‌ ఉంటే.. ఏపీలో 24 శాతం ఉంది. అయితే, అలంకరణ కోసం కొనేవారు కొందరైతే.. ఆదాయం మరికొందరి ఆలోచన. ఇక మన మగువలకు బంగారం అంటే ఎక్కడలేని సెంటిమెంట్. మెడలో బంగారం లేకపోతే.. గొంతులో ప్రాణం లేనంత ఫీలింగ్ కొందరిది. ఇన్వెస్ట్‌మెంట్ కోసం కొనే వాళ్లను పక్కనబెడితే.. మధ్య తరగతి వారందరూ అలంకారం కోసమే నగలు కొంటారు. ఎంతో కష్టపడి పైసా పైసా కూడబెట్టి నగలు కొంటారు. ఎంతో కష్టం వస్తే తప్పిచ్చి.. నగలు అమ్మడం, తాకట్టు పెట్టడం లాంటివి చేయరు.

ఎప్పుడైతే దేశంలోకి కరోనా ఎంటరైందో.. ప్రతి కుటుంబం ఆర్ధికంగా చితికిపోయింది. ఆదాయం తగ్గి కొందరు ఇబ్బంది పడితే.. ఆస్పత్రుల ఖర్చు ఎక్కువై మరికొందరు చిక్కుల్లో పడ్డారు. కరోనా ట్రీట్‌మెంట్ల కోసం కోట్లాది కుటుంబాలు లక్షలాది రూపాయల బిల్లులు కట్టాల్సి వచ్చింది. ఉపాధి కోల్పోయి.. ఉద్యోగం పోగొట్టుకుని లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. చిన్న చిన్న ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే వారిపై కరోనా ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఆదాయ మార్గాలు లేక దాచుకున్న బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకుని ఆ సొమ్ముతో బతుకు బండి లాగించిన కుటుంబాలు వీధి వీధిలో కనిపిస్తున్నాయి.

బంగారంపై తక్కువ వడ్డీతో రుణాలు రావడం.. ఈజీగా ప్రాసెస్ చేయడం వంటివి గోల్డ్ లోన్ వైపు సామాన్యులు అట్రాక్ట్ కావడానికి ప్రధాన కారణం. అగ్రికల్చర్, ప్రాపర్టీ లోన్లు అయితే.. ష్యూరిటీ చూపించాల్సి ఉంటుంది. సవాలక్ష ప్రాసెస్ ఉంటుంది. అదే గోల్డ్ లోన్స్ అయితే.. క్షణాల్లో ప్రాసెస్ అవుతాయి. ఆ గోల్డ్ మనదే అనే ఫ్రూప్ చూపించగలిగితే చాలు.. గంటల్లో డబ్బు అకౌంట్‌లో పడిపోద్ది. పైగా తులం బంగారానికి 33వేల వరకూ లోన్ పొందొచ్చు.

ఏపీలో గోల్డ్ లోన్స్ ఎక్కువగా తీసుకోవడానికీ చాలా రీజన్స్ ఉన్నాయి. తెలంగాణతో పోల్చితే ఏపీలో కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. వాళ్లలో చాలామంది వైద్యం కోసం అప్పులు చేయాల్సి వచ్చింది. ఆ అప్పులు తీరాలంటే.. బంగారం తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఇంకోవైపు వ్యవసాయ అవసరాలు.. పెట్టుబడులకు డబ్బు అవసరం కావడంతో బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల చుట్టూ పరుగులు పెడుతున్నారు.

కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు ఏమో గానీ.. లోన్ తీసుకునే కస్టమర్లకు ఎదురొచ్చే ప్రైవేట్ కంపెనీలు కోకొల్లలు. మా కంపెనీలో వడ్డీ తక్కువ. జీరో ప్రాసెసింగ్ ఫీజుతో లోన్ ఇస్తాం. తరుగు తక్కువ ఇస్తాం అంటూ ఊదరగొట్టి.. బంగారాన్ని రాబట్టుకుంటారు. తీరా ఆర్ధిక పరిస్థితి తారుమారై.. ఆ లోన్ సరైన టైమ్‌లో కట్టకపోతే.. ఇక టార్చర్ షురూ. నెల రోజుల్లోనే బంగారాన్ని వేలం వేస్తారు. ఇలాంటి బాధితులు తెలుగు రాష్ట్రాల్లో లెక్కకు మించి ఉన్నారు. తాహతుకు మించి అప్పులు చేసి బంగారం కొనే వాళ్లు కొందరైతే.. అప్పులు తీర్చుకోవడం కోసం బంగారం కుదువ పెట్టే వాళ్లు మరికొందరు. మొత్తంగా కారణం ఏదైనా గోల్డ్ షాపు నుంచి నేరుగా బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల చేతుల్లోకి గోల్డ్ వెళ్లిపోతోంది.

Also read:

Paytm cashback offer: రూ. 4 ట్రాన్స్‌ఫర్‌ చేయండి.. రూ. 100 క్యాష్‌ బ్యాక్‌ పొందండి..!

TTD Temple: నేడు టీటీడీ బోర్డు కీలక సమావేశం.. 2022-23 టీటీడీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న పాలక మండలి..

Visakhapatnam: విశాఖలో మరో అంతర్జాతీయ స్థాయి వేడుక.. పీఫ్ఆర్, మిలన్ 2022 కోసం ముస్తాబవుతున్న సాగరతీరం