Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపిలో విస్తరిస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ మల్టీప్లెక్స్ థియేటర్స్..

నిన్నటి వరకు విద్యా,వ్యాపార,వాణిజ్య కేంద్రంగా విరాసిల్లిన ఆంధ్ర ప్రదేశ్ మళ్ళీ రాజధాని రాకతో పరిస్దితులు మారిపోతున్నాయి.మెట్రో నగరాలతో పోటీ పడేలా వ్యాపార రంగం ఏపిలో విస్తరిస్తోంది.ముఖ్యంగా వినోద రంగంలో ఏపిలో ప్రలు ప్రధాన పట్టణాల జెడ్ స్పీడ్ తో పరుగులు పెడుతున్నాయి.

Andhra Pradesh: ఏపిలో విస్తరిస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ మల్టీప్లెక్స్ థియేటర్స్..
Multiplex Cinema Halls
Follow us
S Haseena

| Edited By: Rajeev Rayala

Updated on: Jan 06, 2025 | 7:06 PM

ఎంటర్టైన్ మెంట్ రంగంలో ప్రతిష్టాత్మకమైన సంస్ధలు సైతం ఆంద్రప్రదేశ్‌లోని పలు ప్రధాన నగరాల్లో తమ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. వీటికి ప్రజల నుంచి ఆదరణ లబిస్తుండటంతో అటు ఉత్తరాంధ్ర నుంచి కోస్తాంధ్ర వరకు కోస్తా ఆంధ్ర నుంచి రాయలసీమ వరకు మల్టీప్లెక్స్‌లు విస్తరించాయి. ఒకప్పుడు సినిమా పేరు వినగానే ఏపీలోని విజయవాడ నగరం గుర్తుకు వచ్చేది. ఎన్టీఆర్ నుంచి ఎఎన్నార్ వరకు ఏ సినిమా విడుదల అయినా తొలి ఆట విజయవాడలో ఆడల్సాందే. ఉమ్మడి రాష్ట్రంలో రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పటికీ సినిమా కేంద్రంగా బెజవాడే ఉండేది. అందుకే ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడాలేనన్ని థియేటర్లు ఇక్కడా వెలిశాయి. బడాబడా రాజకీయ నేతలు సైతం ఇక్కడ సినిమా హాళ్లు నిర్మించి ఆదాయం ఆర్జించారు. అయితే మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ మారింది. అందులో భాగంగానే ఈ మార్పును అనుకున్న స్ధాయిలో అందిపుచ్చుకోక పోవడంతో విజయవాడతో పాటు వెండితెర వైభవం ఏపిలో తగ్గుతూ తగ్గుతూ వచ్చింది. ఇదే సమయంలో హైదరాబాద్ వంటి మెట్రో నగరాలు, సిని నిర్మాణ  ప్రదేశాల్లో లేటెస్ట్ టెక్నాలజీతో థియేటర్లు వెలియడంతో ప్రేక్షకులు వీటికి అలవాటు పడ్డారు. దీంతో కార్పోరేట్ సంస్ధలు ఈ రంగంలోకి ప్రవేశించి ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా థియేటర్లు నిర్మించి అభిమానాన్ని చూరగొన్నాయి. దీంతో ఏపీలోని ఇతర నగరాల్లోని థియేటర్ల యజమానులు కూడా తమ ఆలోచనలు మార్చుకుని మల్లీఫ్లెక్స్ థియేటర్ల నిర్మాణానికి ఆసక్తి ఇప్పుడు చూపుతున్నారు. వీటి నిర్మాణం నిర్వహణ విషయంలో ఖర్చు ఎక్కువగా ఉన్నా ప్రేక్షకుల మధ్ధతు ఉండటంతో రాజీపడకుండా సౌకర్యాలు కల్పిస్తున్నారు.

ఏపిలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇప్పుడు చాలా చోట్ల మల్టీఫ్లెక్స్ థియేటర్ల హవా నడుస్తుంది. అటు విశాఖ నుంచి విజయవాడ వరకు ఇటు విజయవాడ నుంచి తిరుపతి వరకు ఇలా చాలా ప్రాంతాల్లో మల్టీఫ్లెక్స్ నిర్మాణాలు రూపు దిద్దుకున్నాయి.వీటికి స్ధానికులు కూడా బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. కుటుంబసమేతంగా వస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్క సినిమాలకే పరిమితం కాకుండా పిల్లలు ఆడుకునేందుకు గేమింగ్, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్    లాంటివి ఒకే చోట ఉండటంతో ప్రేక్షకులు కుటుంబంతో సహా వచ్చి సరదాగా గడుపుతున్నారు. వీకెండ్ డేస్ లో ఈ మల్టీ ఫ్లెక్స్ థియేటర్లు చిన్నా, పెద్దల కేరింతలతో కళకళలాడుతన్నాయి.

ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉండటం, కోరుకున్న చోట కూర్చునే వసతి, ఏ సమయంలో కోరుకుంటే ఆ సమయంలో సినిమాలు చూసుకునే వీలుండటంతో విద్యాధికులు, యూత్ , ఉద్యోగులు, వ్యాపారులు వీటి పట్ల ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇతర థియేటర్లతో పోల్చుకుంటే ధర కాస్తా ఎక్కువంటున్నారు ప్రేక్షకులు. కొత్త టెక్నాలజీ, నూతన అనుభవం కలుగుతున్నా..  ధరలు తగ్గిస్తే మరింత చూసే అవకాశం కలుగుతుందంటున్నారు. మల్టిప్లెక్స్ రాక ఏపిలో పెరగటంతో సింగల్ స్క్రీన్స్ ఆకుపెన్సీ రోజురోజుకి తగ్గుతూ వచ్చింది. దీనిని అధిగమించేదుకు ఆయా థియేటర్ యజమానులు సైతం ఇటీవల వాటిని ఆధునీకరిస్తున్నారు ఇప్పటికే ఏపిలో ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ను ఆధునీకరించారు. ఆందులో భాగంగా లేటెస్ట్ టెక్నాలజీతో ఫోర్ కే స్క్రీన్స్, డాల్బీ అట్మాస్ తో సిద్ధం చేస్తున్నారు. ఇందుకు కోట్లాది రూపాయలు ఖర్చవుతున్నా ఏ మాత్రం వెనకాడటం లేదు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.