Vijayawada: విజయవాడలో పర్యటించనున్న నితిన్‌ గడ్కరీ.. మరికాసేపట్లో బెంజిసర్కిల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం..

విజయవాడలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. దాదాపు 22 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

Vijayawada: విజయవాడలో పర్యటించనున్న నితిన్‌ గడ్కరీ.. మరికాసేపట్లో బెంజిసర్కిల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం..
Benz Circle Flyover
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 17, 2022 | 9:32 AM

విజయవాడలో(Vijayawada ) వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ(Union Minister Gadkari). దాదాపు 22 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. విజయవాడ కేంద్రంగా నిర్మాణం పూర్తి అయిన నేపథ్యంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు(Benz Circle flyover) ప్రారంభోత్సవాలు, భూమిపూజ చేయనున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో(Jagan Mohan Reddy) కలిసి కేంద్రమంత్రి గడ్కరీ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఉదయం 9 గంటలకు ఆయన బయల్దేరారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 11.45 గంటలకు నితిన్ గడ్కరీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఇందిరాగాంధీ స్టేడియానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు ఫొటో ఎగ్జిబిషన్‌ గడ్కరీ సందర్శించనున్నారు.

అయితే మధ్యాహ్నం 12.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.45 గంటల వరకు ఇందిరిగాంధీ స్టేడియంలో ఎన్‌హెచ్ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. అందులో 1.45 గంటలకు ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజిసర్కిల్ ఫ్లైఓవర్ కేంద్ర మంత్రి నితన్ గడ్కరీ ప్రారంభించనున్నారు.

ఇందులో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ చెందినవి 13 వేల 806 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయి. రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖకు చెందినవి 7 వేల 753 కోట్ల ప్రాజెక్టులు ఉన్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి సీఎం నివాసానికి పయనం కానున్నారు.

మధ్యాహ్నం 2.20 గంటల నుంచి 3.30 గంటల వరకు తాడేపల్లిలో జాతీయ రహదారి ప్రాజెక్టులపై గడ్కరీ సమీక్ష జరపనున్నారు. అనంతరం సీఎం నివాసంలో గడ్కరీ విందు చేయనున్నారు. మధ్యాహ్నం 3.20 నిమిషాలకు కనకదుర్గమ్మ ఆలయాన్ని గడ్కరీ సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు.

అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి 5.15 గంటల వరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గడ్కరీని పార్టీ కార్యవర్గం ఘనంగా సత్కరించనుంది. సాయంత్రం 5.20 నుంచి 5.45 గంటల మధ్య గన్నవరం విమానాశ్రయం నుంచి నాగపూర్ కు గడ్కరీ బయల్దేరి వెళ్లనున్నారు.

ఇవి కూడా చదవండి: Medaram Jathara 2022: మహా జన జాతరలో సందడిగా తొలి ఘట్టం.. ఇవాళ సమ్మక్క ఆగమనం

CM KCR Birthday: 68వ వసంతంలోకి సీఎం కేసీఆర్.. రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జన్మదిన వేడుకలు..

రెండోసారి తల్లైన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
రెండోసారి తల్లైన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
ఏడాదిలో ఒక్క సెలవు కూడా పెట్టని ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఈయన..
ఏడాదిలో ఒక్క సెలవు కూడా పెట్టని ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఈయన..
గేమ్ ఛేంజర్ కోసం చరణ్, శంకర్ రెమ్యునరేషన్ ఎంతంటే..
గేమ్ ఛేంజర్ కోసం చరణ్, శంకర్ రెమ్యునరేషన్ ఎంతంటే..
రైతు భరోసాపై కసరత్తు.. మరింత స్పష్టత వచ్చేసింది..
రైతు భరోసాపై కసరత్తు.. మరింత స్పష్టత వచ్చేసింది..
ఇకపై ఇంటర్ జూనియర్‌ కాలేజీల్లో ఉత్తుత్తి ప్రాక్టికల్స్‌కు చెక్‌
ఇకపై ఇంటర్ జూనియర్‌ కాలేజీల్లో ఉత్తుత్తి ప్రాక్టికల్స్‌కు చెక్‌
మహిళ శరీర నిర్మాణంపై మాట్లాడటం కూడా లైంగిక వేధింపులతో సమానం..
మహిళ శరీర నిర్మాణంపై మాట్లాడటం కూడా లైంగిక వేధింపులతో సమానం..
టీమిండియా స్వ్కాడ్‌లోకి ఎంటరవుతోన్న దేశవాళీ డేంజరస్ డైనోసార్స్
టీమిండియా స్వ్కాడ్‌లోకి ఎంటరవుతోన్న దేశవాళీ డేంజరస్ డైనోసార్స్
విశాల్ అందుకే వణికిపోతూ మాట్లాడారు.. ఖుష్బూ..
విశాల్ అందుకే వణికిపోతూ మాట్లాడారు.. ఖుష్బూ..
కెనడా ప్రధాని పదవి రేసులో భారతీయ సంతతి మహిళ అనితా ఆనంద్
కెనడా ప్రధాని పదవి రేసులో భారతీయ సంతతి మహిళ అనితా ఆనంద్
టీమిండియాదే ఛాంపియన్స్ ట్రోఫీ.. ఆ రూల్‌తో మిగతా జట్లు ఇంటికే
టీమిండియాదే ఛాంపియన్స్ ట్రోఫీ.. ఆ రూల్‌తో మిగతా జట్లు ఇంటికే