AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Politics: చిక్కుల్లో అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్.. ఆళ్లగడ్డలో మళ్లీ కేసు.. ఈసారి కేసు పెట్టింది ఎవరో తెలుసా..

మాజీ మంత్రి, టీడీపీ నేత అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ మళ్లీ చిక్కుల్లో పడ్డారు. వీళ్లిద్దరిపై ఆళ్లగడ్డలో మళ్లీ కేసు నమోదైంది. ఈసారి కేసు పెట్టింది ఎవరో కాదు.. వరసకు అఖిలప్రియ అన్న అయ్యే..

AP Politics: చిక్కుల్లో అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్.. ఆళ్లగడ్డలో మళ్లీ కేసు.. ఈసారి కేసు పెట్టింది ఎవరో తెలుసా..
Bhuma Akhila Priya And Her
Sanjay Kasula
|

Updated on: Feb 17, 2022 | 9:04 AM

Share

కర్నూల జిల్లా (Kurnool District) ఆళ్ళగడ్డలో రాజకీయాలు(Allagadda Politics) రసవత్తరంగా సాగుతున్నాయి. తెలుగు దేశం పార్టీ(TDP) నేతలపై వరుసగా కేసులు నమోదు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆళ్లగడ్డ పట్టణంలో బస్ షెల్టర్ కూల్చడాన్ని అడ్డుకుని కాంట్రాక్టర్‌పై దురుసుగా ప్రవర్తించారని పోలీసులు మాజీమంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మాజీ మంత్రి, టీడీపీ నేత అఖిలప్రియ(Bhuma Akhila Priya), ఆమె భర్త భార్గవ్(Bhargav Ram) మళ్లీ చిక్కుల్లో పడ్డారు. వీళ్లిద్దరిపై ఆళ్లగడ్డలో మళ్లీ కేసు నమోదైంది. ఈసారి కేసు పెట్టింది ఎవరో కాదు.. వరసకు అఖిలప్రియ అన్న అయ్యే భూమా కిషోర్ రెడ్డి ఫిర్యాదు మేరకే ఈ కేసు నమోదైంది. భూమా కిషోర్ రెడ్డి.. ఖాళీ స్థలంలో కట్టుకున్న కాంపౌండ్ వాల్ కూల్చివేసి వాచ్ మెన్‌పై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. దీంతో ఇద్దరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. భూమా కిషోర్ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఓ ఖాళీ స్థలం కాంపౌండ్‌ వాల్‌ని‌ కూల్చేసి, వాచ్ మెన్ పై దాడి చేశారన్నది భార్గవ్‌పై అభియోగం.

ఆళ్లగడ్డలో నాలుగు రోజుల క్రిందట రోడ్డు వెడల్పులో భాగంగా స్థానిక ఫోర్ రోడ్ సర్కిల్ వద్ద బస్ షెల్టర్‌ని తొలగిస్తున్న సమయంలో తన తండ్రి భూమా నాగిరెడ్డి ప్రజల కోసం కట్టించిన బస్ షెల్టర్‌ని ఎలా కూల్చేస్తారని కాంట్రాక్టర్‌తో వాగ్వావాదానికి దిగారు. కూల్చివేత పనులను అడ్డుకున్నారు.

భూమా విఖ్యాత్ రెడ్డి తన పై దురుసుగా ప్రవర్తించి దూషించడంతో పాటు పనులకు ఆటంకం కలిగించారని కాంట్రాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జగత్ విఖ్యాత్ రెడ్డితో పాటు మరో 15మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి: Medaram Jathara 2022: మహా జన జాతరలో సందడిగా తొలి ఘట్టం.. ఇవాళ సమ్మక్క ఆగమనం

CM KCR Birthday: 68వ వసంతంలోకి సీఎం కేసీఆర్.. రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జన్మదిన వేడుకలు..