CM KCR Birthday: 68వ వసంతంలోకి సీఎం కేసీఆర్.. రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జన్మదిన వేడుకలు..

Telangana CM KCR Birthday Celebrations: టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (CM KCR) జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఈ రోజుతో (ఫిబ్రవరి 17) 68వ వసంతంలోకి అడుగుపెట్టారు.

CM KCR Birthday: 68వ వసంతంలోకి సీఎం కేసీఆర్.. రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జన్మదిన వేడుకలు..
Kcr
Follow us

|

Updated on: Feb 17, 2022 | 8:20 AM

Telangana CM KCR Birthday Celebrations: టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (CM KCR) జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఈ రోజుతో (ఫిబ్రవరి 17) 68వ వసంతంలోకి అడుగుపెట్టారు. తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిషలు పోరాటం చేసిన యోధుడు సీఎం కేసీఆర్‌కు ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ శ్రేణులు నిర్వహిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ (CM KCR Birthday) జన్మదినాన్ని నిర్వహించాలని మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈనెల 15 నుంచి నేటివరకు జన్మదిన వేడుకలను నిర్వహించాలని సూచించారు. దీనిలో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామగ్రామన కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు తెలంగాణ ముఖ్యమంత్రికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కాగా.. ఇటీవల జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ బర్త్‌డే వేడుకలను ఈసారి ఘనంగా నిర్వహిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై యుద్దం ప్రకటించి దూకుడు పెంచిన కేసీఆర్‌ ఇప్పటికే పవర్‌ సెంటర్‌గా మారారు.

ముఖ్యమంత్రి కేసీఆర్.. 1954 ఫిబ్రవరి 17న రాఘవరావు వెంకటమ్మ దంపతులకు సిద్దిపేట చింతమడకలో జన్మించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు అహర్నిశలు కేసీఆర్ పోరాడారు. తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా 2021లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించిన సీఎం కేసీఆర్.. 2009లో స్వరాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆ తర్వాత కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. ఆ తర్వాత నాలుగున్నరేళ్లకు తెలంగాణ కల సాకారమైంది. ఏపీ విభజన తర్వాత 2014లో తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కె. చంద్రశేఖరరావు (కేసీఆర్) ఎన్నికయ్యారు. అప్పటినుంచి ఆయనే సీఎంగా కొనసాగుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు.

Also Read:

Medaram Jathara 2022: మహా జన జాతరలో సందడిగా తొలి ఘట్టం.. ఇవాళ సమ్మక్క ఆగమనం

Andhra Pradesh vs Telangana: హోంశాఖ త్రిసభ్య కమిటీ తొలి సమావేశం నేడు.. తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారమయ్యేనా!

'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..