TTD Temple: నేడు టీటీడీ బోర్డు కీలక సమావేశం.. 2022-23 టీటీడీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న పాలక మండలి..

TTD Temple: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక సమావేశం నేడు జరుగనుంది. ఉదయం 10 గంటలకు తిరుమలలోని..

TTD Temple: నేడు టీటీడీ బోర్డు కీలక సమావేశం.. 2022-23 టీటీడీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న పాలక మండలి..
TTD
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 17, 2022 | 9:02 AM

TTD Temple: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక సమావేశం నేడు జరుగనుంది. ఉదయం 10 గంటలకు తిరుమలలోని అన్నమయ్య భవన్ లో జరుగనున్న ఈ సమావేశంలో 2022-23 టీటీడీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రూ.3,171 కోట్ల అంచనాతో 2022-23 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అలాగే 49 అంశాలతో ఎజెండా రూపొందించిన టీటీడీ అధికారులు.. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇవాళ ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ ప్రకారం.. రూ. 1,000 కోట్లు హుండీ ద్వారా ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. కాగా, కోవిడ్ తీవ్రత తగ్గిన నేపథ్యంలో శ్రీవారి దర్శన టికెట్ల పెంపు, ఆర్జిత సేవలకు భక్తులును అనుమతించే అంశంపై నిర్ణయం తీసుకోనుంది టీటీడీ పాలక మండలి. శ్రీ వేంకటేశ్వర ఆపన్న హృదయ స్కీమ్ పేరుతో మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టనుంది. ఈ పథకానికి రూ.లక్ష విరాళమిచ్చిన దాతలకు ప్రివిలేజ్ గా ఒకసారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. అలాగే.. శ్రీవేంకటేశ్వర అపన్న హృదయ స్కీమ్ కు వచ్చిన విరాళాలను చిన్న పిల్లల ఆపరేషన్ ఖర్చులకు వినియోగించాలని టీటీడీ నిర్ణయించింది.

తిరుపతిలో నిర్మిస్తున్న శ్రీనివాస సేతు పనులకు రూ.25 కోట్లు నిధులు విడుదలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నదానం కాంప్లెక్స్‌లో సోలార్ స్టీమ్ కుకింగ్ సిస్టమ్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనుంది పాలక మండలి. అలాగే తిరుపతిలో చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి రూ.230 కోట్ల నిధులు కేటాయింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. కొత్త పీఆర్సీ విధానం అమలు చేయడంపైనా కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ మేరకు కామన్ గుడ్ ఫండ్ కింద రూ.50 కోట్లు టీటీడీ చెల్లించనుంది. శ్రీవేంకటేశ్వర ఆయుర్వేద ఫార్మసి అభివృద్ధికి రూ.3.90 కోట్లు కేటాయించనున్నారు. తిరుపతిలో సైన్స్ సిటీ నిర్మాణం కోసం కేటాయించిన భూములను వెనక్కి తీసుకోనుంది.

Also read:

IND vs WI, T20I Series: బీసీసీఐ కీలక నిర్ణయం.. చివరి మ్యాచ్ చూసేందుకు వారికి అనుమతి..!

Health Tips: ఖాళీ కడుపుతో జ్యూస్‌ తాగుతున్నారా? అయితే ఇవి తప్పక తెలుసుకోండి..

Igloo Cafe: కశ్మీర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇగ్లూ కేఫ్‌ !! వీడియో