IND vs WI, T20I Series: బీసీసీఐ కీలక నిర్ణయం.. చివరి మ్యాచ్ చూసేందుకు వారికి అనుమతి..!

భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య అక్టోబర్ 20న జరిగే మూడవది, చివరి టీ20 మ్యాచ్‌కు ఇరవై వేల మంది ప్రేక్షకులను అనుమతించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిర్ణయించింది.

IND vs WI, T20I Series: బీసీసీఐ కీలక నిర్ణయం.. చివరి మ్యాచ్ చూసేందుకు వారికి అనుమతి..!
India Vs West Indies
Follow us
Venkata Chari

|

Updated on: Feb 17, 2022 | 8:54 AM

IND vs WI, T20I Series: భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య అక్టోబర్ 20న జరిగే మూడవది, చివరి టీ20 మ్యాచ్‌కు ఇరవై వేల మంది ప్రేక్షకులను అనుమతించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిర్ణయించింది. వీరిలో ఎక్కువ మంది క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) టిక్కెట్ హోల్డర్ సభ్యులుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ CAB చీఫ్ అభిషేక్ దాల్మియాకు ఓ ఈ-మెయిల్‌లో పంపి ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. అందరితో చర్చించిన తరువాతే ఈనిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈడెన్‌లో వెస్టిండీస్‌తో జరిగే చివరి టీ20 మ్యాచ్‌కి ప్రేక్షకులను అనుమతించవచ్చంటూ అందులో రాసుకొచ్చారు..

ఈ మేరకు దాల్మియా మాట్లాడుతూ, ‘ఈ నిర్ణయం తీసుకున్నందుకు బీసీసీఐకి మేం చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.ఈ మేరకు ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్‌కు లైఫ్‌ టైం అసోసియేట్, వార్షిక గౌరవ సభ్యులు హాజరుకానున్నారు” అంటూ పేర్కొన్నారు.

బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ గతంలో ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆటగాళ్ల ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవడమే మా ముఖ్య ఉద్దేశం అని, అందుకే మ్యాచులకు ప్రేక్షకులను అనుమతించడం లేదని తెలిపాడు. అభిమానుల ప్రవేశాన్ని అనుమతించాలని దాల్మియా బోర్డును అభ్యర్థించాడు. గతేడాది నవంబర్‌లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో పాల్గొనేందుకు 70 శాతం మంది ప్రేక్షకులను అనుమతించారు. ఈ మేరకు దాల్మియా బీసీసీఐని కోరాడు.

నిన్న జరిగిన మ్యాచ్‌తో పాటు శుక్రవారం జరిగే రెండో టీ20 ఇంటర్నేషనల్‌ మ్యాచ్ కోసం, కార్పొరేట్ బాక్స్, డాక్టర్ బీసీ రాయ్ క్లబ్‌హౌస్ ఎగువ శ్రేణిలో 2000 మందికి పైగా అభిమానులు కూర్చోవడానికి అనుమతించారు. మొదటి రెండు మ్యాచ్‌లకు, ఈ మ్యాచ్ పాస్ స్పాన్సర్‌ల ప్రతినిధులకు మాత్రమే.

వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్ అహ్మదాబాద్‌ స్టేడియంలో జరిగింది. ఈ వన్డేలకు కూడా ప్రేక్షకులను అనుమతించలేదు. భారత్ తదుపరి సిరీస్ ఫిబ్రవరి 24న శ్రీలంకతో ప్రారంభమవుతుంది. లక్నోలో జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌ని ఖాళీ స్టేడియంలో నిర్వహించనున్నారు.

Also Read: IND vs WI 1st T20: అర్ధ సెంచరీతో రాణించిన నికోలస్‌ పూరన్‌.. టీమిండియా ముందు మోస్తరు లక్ష్యం..

Ipl 2022 Auction: కొత్త ఆటగాళ్లకు అదిరిపోయే వెల్కమ్‌ చెప్పిన రాజస్థాన్‌ రాయల్స్‌.. షారుఖ్‌ ఖాన్‌ పాటతో..