13 బంతుల్లో తుఫాన్ ఇన్నింగ్స్.. బంతితోనూ ప్రత్యర్ధికి చెమటలు పట్టించిన ధోని శిష్యుడు.. ఎవరో తెలుసా.!

ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే.. ముందుంది అసలు సినిమా అంటూ ధోని శిష్యుడు మొయిన్ అలీ తన విశ్వరూపాన్ని చూపించాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో..

13 బంతుల్లో తుఫాన్ ఇన్నింగ్స్.. బంతితోనూ ప్రత్యర్ధికి చెమటలు పట్టించిన ధోని శిష్యుడు.. ఎవరో తెలుసా.!
Moeen Ali
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 17, 2022 | 4:03 PM

ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే.. ముందుంది అసలు సినిమా అంటూ ధోని శిష్యుడు మొయిన్ అలీ తన విశ్వరూపాన్ని చూపించాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో కొమిల్లా విక్టోరియన్స్, చటోగ్రామ్ ఛాలెంజర్స్‌తో జరిగిన సెకండ్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో 13 బంతుల్లో తుఫాన్ ఇన్నింగ్స్.. బంతితోనూ మెరుపులు మెరిపించాడు మొయిన్ అలీ. ధోని స్టైల్‌లో ఫినిషర్‌గా తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో విక్టోరియన్స్ జట్టు తరపున బరిలోకి దిగిన మొయిన్ అలీ(Moeen Ali).. బౌలింగ్‌లో 3 ఓవర్లు వేసి 20 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అతడు వేసిన 18 బంతుల్లో 11 బంతులకు పరుగులేవి సమర్పించలేదు. అలాగే వరుసగా 2 బంతుల్లో 2 వికెట్లు తీశాడు. అలాగే బ్యాటింగ్‌లో 13 బంతుల్లో 30 పరుగులు చేసి రఫ్ఫాడించాడు.

ఇదిలా ఉంటే.. చెన్నై సూపర్ కింగ్స్ రూ. 8 కోట్లతో మొయిన్ అలీని రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక కొమిల్లా విక్టోరియన్స్ జట్టు 12.5 ఓవర్లలోనే టార్గెట్ చేధించింది… 149 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన కొమిల్లా విక్టోరియన్స్ 12.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. దీనితో కొమిల్లా జట్టు ఫైనల్‌కు చేరుకుంది. బ్యాట్‌తో మొయిన్ అలీ ప్రత్యర్ధి జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు. 13 బంతుల్లో 2 సిక్సర్లు, 3 ఫోర్లతో 30 పరుగులు చేశాడు.

మొయిన్ అలీని టీమిండియా మాజీ కూల్ కెప్టెన్ అన్ని రంగాల్లోనూ ఉపయోగించుకున్నాడు. అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ కీలకమైన దశల్లో రంగంలోకి దించి ఫలితాలు రాబాట్టాడు. దీంతో అలీపై ధోనీకి బాగా నమ్మకం కుదిరింది. మొయిన్ అలీ 2018లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తన IPL ప్రయాణాన్ని ప్రారంభించాడు. అతను విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జట్టు కోసం మూడు సీజన్లలో 19 IPL మ్యాచ్‌లు ఆడాడు. 158 స్ట్రైక్ రేట్‌తో 309 పరుగులు చేశాడు. బంతితో, మొయిన్ పది వికెట్లు తీశాడు. 2021 ఐపీఎల్ వేలంలో మాత్రం ధోని ఈ ఆటగాడిని ఏకంగా రూ. 7 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ధోని ఆధ్వర్యంలో మరింత రాటు దేలిన మొయిన్ అలీ, ధోని నమ్మకాన్ని నిలబెట్టుకుని ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ క్రమంలోనే నెంబర్ 3లో నూ తుఫాన్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్‌లో ధోని నాయకత్వంలో మొయిన్ అలీ అద్భుత ఆటతీరు కనబరచడంతో.. అతడిపై నమ్మకం ఉంచిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్.. టీ20లలో మొయిన్ అలీని వన్ డౌన్ దింపడమే కాకుండా.. బౌలింగ్‌లోనూ తగినన్ని ఓవర్లు ఇస్తూ వచ్చాడు.

Also Read:

Viral Video: ఇదేందిది నేనేడా చూడలే.. ఈ వ్యక్తి చేసిన చిలిపి పనికి ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే!

Viral Photos: విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా.? తక్కువ ఖర్చుతో ఈ 8 దేశాల్లో ఇంచక్కా ఎంజాయ్ చెయ్యొచ్చు.!

Sleeping Disorder: నిద్రపోయే ముందు ఈ 5 ఆహారాలను దూరం పెట్టండి.. లేదంటే ఏమవుతుందో తెలుసా!