IND vs WI 1st T20: అర్ధ సెంచరీతో రాణించిన నికోలస్‌ పూరన్‌.. టీమిండియా ముందు మోస్తరు లక్ష్యం..

ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా విండీస్‌ తో జరుగుతున్న మొదటి టీ 20 మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు రాణించారు. టీ 20ల్లో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన కరీబియన్‌ జట్టును భారీస్కోరు చేయకుండా నిలువరించారు.

IND vs WI 1st T20: అర్ధ సెంచరీతో రాణించిన నికోలస్‌ పూరన్‌.. టీమిండియా ముందు మోస్తరు లక్ష్యం..
Indian Cricket Team
Follow us
Basha Shek

|

Updated on: Feb 16, 2022 | 9:24 PM

ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా విండీస్‌ తో జరుగుతున్న మొదటి టీ 20 మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు రాణించారు. టీ 20ల్లో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన కరీబియన్‌ జట్టును భారీస్కోరు చేయకుండా నిలువరించారు. టాస్‌ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. నికోలస్‌ పూరన్‌ 43 బంతుల్లో 61 పరుగులు ( 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) చేసి విండీస్‌ భారీస్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. కైల్‌ మేయర్స్‌ ( 24 బంతుల్లో 31), కెప్టెన్‌ పొలార్డ్‌ (19 బంతుల్లో 24) పూరన్‌కు సహాయం అందించారు. బ్రెండన్‌ కింగ్‌(4), రోస్టన్‌ ఛేజ్‌(4), రోమన్ పావెల్‌ (2), అకిల్‌ హొస్సేన్‌ (10) నిరాశ పరిచారు.

భువీ శుభారంభం.. రాణించిన స్పిన్నర్లు..

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న టీమిండియాకు స్వింగ్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ శుభారంభం అందించాడు. మొదటి ఓవర్లోనే బ్రెండన్‌ కింగ్‌ను బోల్తా కొట్టించాడు. అయితే మరో ఓపెనర్‌ కైల్‌ మేయర్స్‌ ధాటిగా ఆడాడు, వన్‌డౌన్‌లో వచ్చిన నికోలస్‌ పూరన్‌ తో కలిసి రెండో వికెట్‌కు 47 పరుగులు జోడించారు. భారీ భాగస్వామ్యం దిశగా కొనసాగుతోన్న ఈ జోడిని యుజువేంద్ర చాహల్ విడగొట్టాడు. మరోవైపు రవిబిష్ణోయ్‌ కూడా కట్టుదిట్టంగా బంతులేశాడు. అతను వేసిన 11 ఓవర్‌లో విండీస్‌ రెండు వికెట్లను కోల్పోవడంతో స్కోరు బోర్డు నెమ్మదించింది. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేస్తున్నా నికోలస్ పూరన్‌ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. సిక్స్‌లు, ఫోర్లు బాదాడు. మధ్యలో రోస్టన్‌ ఛేజ్‌, రోమన్‌ పావెల్‌, అకిల్‌ హొస్సేన్‌ విఫలమైనా కెప్టెన్‌ పొలార్డ్‌తో కలిసి భారీ స్కోరుకు పునాది వేశాడు. టీమిండియా బౌలర్లలో రవిబిష్ణోయ్‌ (17/2), హర్షల్‌ పటేల్‌ (37/2) రాణించగా చాహర్‌, చాహల్‌, భువీ తలా ఒక్కో వికెట్‌ తీశారు.

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!