Igloo Cafe: కశ్మీర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇగ్లూ కేఫ్ !! వీడియో
ప్రపంచంలోనే అతిపెద్ద ఇగ్లూ కేఫ్ టూరిస్టులను ఆకట్టుకుంటుంది. జమ్ము కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లో ఈ కేఫ్‌ని సయ్యద్ వసీం షా అనే వ్యక్తి రూపోందించాడు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఇగ్లూ కేఫ్ టూరిస్టులను ఆకట్టుకుంటుంది. జమ్ము కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లో ఈ కేఫ్‌ని సయ్యద్ వసీం షా అనే వ్యక్తి రూపోందించాడు. 37.5 అడుగుల ఎత్తు, 44.5 అడుగుల వ్యాసంతో కట్టిన ఇది, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ను కూడా సాధించింది. అయితే ఈ రికార్డు మొన్నటి వరకు స్విట్జర్లాండ్‌లో ఉన్న కేఫ్‌పై ఉండేది. దీని ఎత్తు 33.8 అడుగులు, వ్యాసం 42.4 అడుగులు ఉంది. ఇప్పుడు ఈ రికార్డును బ్రేక్ చేస్తూ.. జమ్ము కాశ్మీర్‌లో ఏర్పాటు చేశారు. గుల్‌మార్గ్‌లో రూపొందించిన ఈ కేఫ్‌లో తొలుత నాలుగు టేబుళ్లు మాత్రమే ఉండేవని, ఒకేసారి 16 మంది భోజనం చేసేవారని తెలిపారు వసీం షా. కానీ ఈ ఏడాది 10 టేబుళ్లు ఏర్పాటు చేసి ఒకేసారి 40 మంది భోజనం చేసేలా రూపొందించాం అని అన్నారు.
Also Watch:
చిల్లర లేకపోతే ఫోన్ పే చేయమంటున్న బెగ్గర్ !! వీడియో
అదృష్టం అంటే ఈమెదే.. ఒక్క లాటరీ టికెట్‌తో రూ.44 కోట్లు గెలిచింది !! వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

