అదృష్టం అంటే ఈమెదే.. ఒక్క లాటరీ టికెట్‌తో రూ.44 కోట్లు గెలిచింది !! వీడియో
అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా వరిస్తుందో తెలీదు. ఇదిగో ఓ కేరళ యువతి కూడా తన అదృష్టం పండి ఒక్కసారిగా కోటీశ్వరురాలైపోయింది.
అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా వరిస్తుందో తెలీదు. ఇదిగో ఓ కేరళ యువతి కూడా తన అదృష్టం పండి ఒక్కసారిగా కోటీశ్వరురాలైపోయింది. కేరళ త్రిశూర్ జిల్లాలోని అంజన్‌గడి ప్రాంతానికి చెందిన లీనా జలాల్ అబుదాబిలోలని ఓ కంపెనీలో హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆమె అబుదాబి వీక్లీ లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. ఈ నెల 3వ తేదీన లక్కీ డ్రా తీయగా, లీనా జలాల్ కొనుగోలు చేసిన టికెట్ కు 44 కోట్ల భారీ ప్రైజ్ మనీ దక్కింది. అయితే, ఆ టికెట్ ను ఆమె తనతో పాటు ఆఫీసులో పనిచేసే మరో తొమ్మిది మందితో కలిసి కొనుగోలు చేసింది. దాంతో, ఆ ప్రైజ్ మనీని ఇప్పుడు వారందరూ పంచుకోనున్నారు. అయినప్పటికీ, ఒక్కొక్కరికి 4 కోట్లు దాకా వస్తుంది.దీనిపై లీనా జలాల్ మాట్లాడుతూ, తన మిత్రులతో కలిసి గత ఏడాది కాలంగా లాటరీ టికెట్లు కొంటున్నానని, లాటరీ తగలడం ఇదే మొదటిసారి అని సంతోషం వ్యక్తం చేశారు.
Also Watch:
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

