Kurnool News: కర్నూలు జిల్లాలో వరుస విషాద ఘటనలు.. వారి ఆవేదన అంతా ఇంతా కాదు..

Andhra Pradesh: కర్నూలు జిల్లాలో వేర్వేరే చోట్ల విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. ఓ చోట అగ్ని ప్రమాదం ఓ చిన్నారి ఆచూకీ దొరక్కుండా చేస్తే..

Kurnool News: కర్నూలు జిల్లాలో వరుస విషాద ఘటనలు.. వారి ఆవేదన అంతా ఇంతా కాదు..
Kurnool
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 17, 2022 | 12:59 PM

Andhra Pradesh: కర్నూలు జిల్లాలో వేర్వేరే చోట్ల విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. ఓ చోట అగ్ని ప్రమాదం ఓ చిన్నారి ఆచూకీ దొరక్కుండా చేస్తే.. మరో చోట గ్యాస్ సిలిండర్ పేలి మహిళ తీవ్రంగా గాయపడింది. మరో చోట జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకెళితే.. ఐదేళ్ళ పాప ఆచూకీ కనిపించకపోవడంతో నిన్నటి నుంచి తల్లిదండ్రుల పడుతున్న ఆవేదన అంతా ఇంతా కాదు. కోల్‌కతాకు చెందిన పరోలి బిబి, శారదా ముల్లా దంపతులు తమ కూతురు ములిరా ముల్లతో కలిసి బతుకుదెరువు కోసం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వ గ్రామంలో ఉన్న పుట్టగొడుగుల ఫ్యాక్టరీకి వచ్చారు. వివిధ రాష్ట్రాలకు చెందిన అయిదు వందల మంది వరకు కూలీలు ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. నిన్న ఈ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పుట్టగొడుగుల పెంపకానికి ఉపయోగించే గుట్టలుగా పోసిన 2,000 టన్నుల వరకు వరి గడ్డి పూర్తిగా దగ్ధమైంది. మంటలు ఆర్పేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఫైరింజన్లు తీసుకువచ్చారు. అందరూ సేఫ్ గా ఉన్నప్పటికీ ఐదేళ్ళ పాప కనిపించకపోవడం లేదు. దాంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పాప ఫోటో చూసుకుంటూ బాధిత తల్లిదండ్రులు రోదిస్తున్నారు. మంటలను ఆర్పివేసినప్పటికీ.. చిన్నారి ఆచూకీ మాత్రం లభించలేదు. బాలిక ఆచూకీ కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

గ్యాస్ సలిండర్ పేలుడు.. ఇదిలాఉంటే.. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా భారత్ గ్యాస్ సిలిండర్ పేలి నాగలక్ష్మి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. సిలిండర్ అయిపోవడంతో కొత్త సిలిండర్ అమర్చిన సమయంలో గ్యాస్ లీక్ అయ్యింది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి సిలిండర్ పేలింది. ఇంట్లోని వస్తువులు మంటలకి కరిగిపోయాయి. ఈ పేలుడు ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురై ఇళ్లలో నుంచి పరుగులు తీశారు. సకాలంలో అధికారులు సంఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పివేయడంతో కాలనీ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. భారత్ గ్యాస్ సిలిండర్లు మాత్రమే పేలుడికి గురవుతున్నాయని మూడు నెలల్లో మూడు సార్లు ప్రమాదాలు జరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి.. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కల్లుదేవకుంట గ్రామ శివారులో ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం సమయంలో ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కావడంతో నలుగురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. బాధితులు మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ని దర్శించుకునేందుకు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసిన మంత్రాలయం పోలీసులు.. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్నారు. బాధితులు బెంగళూరు వాసులుగా గుర్తించారు.

Also read:

KCR Birthday in Australia: ఆస్ట్రేలియాలో ఘనంగా సీఎం కేసీఆర్‌కు జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో విషెస్ చెప్పిన అభిమాని..

Kurnool Check Post: అవన్నీ లగేజీ బ్యాగులు అనుకున్నారు.. ఓపెన్ చేసి చూస్తే కళ్లు చెదిరిపోయాయి..

AP Gold Loans: గోల్డ్ లోన్ తీసుకునే రాష్ట్రాలో టాప్‌లో ఏపీ.. షాకింగ్ విషయాలు మీకోసం..