చిచ్చు రేపిన అనారోగ్యం.. కుమారుడి వైద్య ఖర్చులు భరించలేక.. తండ్రి కఠిన నిర్ణయం

ఆనందంగా సాగిపోతున్న వారి కుటుంబంపై అనారోగ్యం రూపంలో విధి కన్నెర్ర చేసింది. అల్లారు ముద్దుగా చూసుకుంటున్న కుమారుడిని అంతు చిక్కని వ్యాధి రూపంలో వేధించింది...

చిచ్చు రేపిన అనారోగ్యం.. కుమారుడి వైద్య ఖర్చులు భరించలేక.. తండ్రి కఠిన నిర్ణయం
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 17, 2022 | 4:47 PM

ఆనందంగా సాగిపోతున్న వారి కుటుంబంపై అనారోగ్యం రూపంలో విధి కన్నెర్ర చేసింది. అల్లారు ముద్దుగా చూసుకుంటున్న కుమారుడిని అంతు చిక్కని వ్యాధి రూపంలో వేధించింది. కుమారుడికి చికిత్స చేయించేందుకు తండ్రి పడరాని పాట్లు పడ్డాడు. తాహతుకు మించి ఖర్చు చేశాడు. అయినా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. పెద్దాసుపత్రికి తీసుకెళ్తే వ్యాధి నయమవుతుందని స్థానికులు చెప్పినా వినిపించుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఓ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. చికిత్సకు డబ్బులు లేకపోవడంతో కుమారుడిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ముందస్తు పథకం ప్రకారం చిన్నారిని కాల్వ గట్టుకు తీసుకు వెళ్లాడు. అక్కడ గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. మృతదేహాన్ని పొదల్లో పడేశాడు. ఉత్తరాఖండ్ లో జరిగిన ఈ విషాద ఘటన కంటతడి పెట్టి్స్తోంది.

ఉత్తరాఖండ్​లో అమానవీయ ఘటన జరిగింది. ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని రుద్రాపుర్​లో నివాసముండే మహమ్మద్​ తారిక్.. ట్రక్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి షాబన్ రజా అనే మూడున్నరేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇటీవల రజా.. హీమోఫీలియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం స్తోమతకు మించి ఖర్చు చేసినా ఫలితం రాలేదు. వైద్యం అందించే సమయంలో అప్పులు కూడా చేశాడు. అయనా రజా కు ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో.. స్థానికులు దిల్లీలోని ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అప్పచికే ఆర్థికంగా చితికిపోయిన తారిక్.. ఇక ఈ వేదనను తాను భరించలేనని, కుమారుణ్ని చంపేయాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలో ఉత్తర్​ప్రదేశ్​లోని బహేఢీ జిల్లా డాకియాలో ఓ కాలువ వైపు కుమారుడిని తీసుకుని వెళ్లాడు. అక్కడే చిన్నారిని గొంతు నులిమి పొదల్లో పడేశాడు. అనంతరం ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చాడు. సాయంత్రానికి కుమారుడు కనిపించకపోయేసరికి కుటుంబ సభ్యులు నిలదీశారు. అయినా తారిక్ నుంచి సమాధానం రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీటీవీ ఆధారాలతో తారిక్​ను విచారించగా నేరం ఒప్పుకున్నాడు. చిన్నారి మృత దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

Also Read

Vijayawada: బెజవాడ నడిబొడ్డున ట్రాఫిక్ కష్టాలకు చెక్.. బెంజ్ సర్కిల్ సెకండ్ ఫ్లై ఓవర్ ప్రారంభం..

Hijab in AP: ఏపీని తాకిన హిజాబ్ వివాదం.. విద్యార్థినులను అనుమతించని కళాశాల యాజమాన్యం

Bombay High Court: రెండో భార్యకు ఆ హక్కులు ఉండవు.. సంచలన కామెంట్స్ చేసిన హైకోర్టు..